రాజస్తాన్‌ సంక్షోభం : పైలట్‌ వర్గానికి ఊరట

Rajasthan High Court has made Centre a party in the case against Congress - Sakshi

జైపూర్‌ : రాజస్తాన్‌ రాజకీయలు మరో మలుపు తిరిగాయి. హైకోర్టులో అశోక్‌ గెహ్లాత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చుక్కెదురైంది. తాజా సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వాన్ని భాగస్వామ్యంగా చేర్చాలన్న తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. స్వీకర్‌ జారీచేసిన అనర్హత నోటీసులపై శుక్రవారం విచారణ ప్రారంభించిన న్యాయస్థానం సచిన్‌ పైలట్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు అనుమతినిచ్చింది. మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో సచిన్‌ పైలట్‌ వర్గానికి ఊరట లభించింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది. పరిస్థితులు చక్కబడేవరకు సంయమనం పాటించాలని సూచించింది. ఎమ్మెల్యేల అనర్హత నోటీసులపై శుక్రవారం న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా యథాతథ స్థితిని (స్టేటస్‌ కో) పాటించాలని న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో గత రెండు వారాలుగా సాగుతున్న రాజకీయ సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడింది. (రాజస్తాన్‌‌ హైడ్రామా : సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు)

కాగా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి హాజరుకానందున 19 మంది  ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్‌ అనర్హత నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో పైలట్‌ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ స్పీకర్‌ నోటీసులపై విచారణ సాగుతుండగానే ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పు తమ తుది తీర్పు లోబడి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించడంతో తాజాగా వెలువరించే తీర్పుపై మొదటినుంచీ తీవ్ర  ఉత్కంఠ నెలకొంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top