యూపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది: ప్రియాంకా గాంధీ

Priyanka Gandhi Says Women Unsafe In Uttar Pradesh - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్ లో మ‌హిళ‌ల‌కు ఏమాత్రం భ‌ద్ర‌త లేద‌ని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా గురువారం యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాగా ల‌క్నోలోని బాపూ భ‌వ‌న్‌లో ఓ ప్ర‌భుత్వ అధికారి అక్కడ పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగిని వేధించి అరెస్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రియాంక యూపీ ప్రభుత్వం పై ఆరోపణలు చేశారు. స‌చివాల‌యం, రోడ్డు, బహిరంగ ప్రదేశాలలో మ‌హిళ‌లకు భద్రత కరువైందని ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌పై యూపీ ప్రభుత్వం గొప్పగా చెప్తోందని కానీ వాస్తవానికి పరిస్థితులు ఆలా లేవని విమర్శించారు ప్రియాంక. ఓ సోద‌రి త‌న‌కెదురైన లైంగిక వేధింపుల‌పై ఫిర్యాదు చేస్తే అధికారులు పట్టించుకోకపోవడంతో తాను వాటిని వీడియో తీసి వైర‌ల్ చేయాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు.దేశ మ‌హిళ‌లంతా మీ వెంట ఉన్నార‌ని బాధితురాలికి ఆమె భ‌రోసా ఇచ్చారు. శాంతిభద్రతలు, మహిళల భద్రత సమస్యపై కాంగ్రెస్ రాష్ట్ర స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ వాదనను ఖండించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top