అందుకే రాజీనామా చేశా : పోతుల సునీత | Pothula Sunitha Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలం: సునీత

Oct 28 2020 4:00 PM | Updated on Oct 28 2020 5:59 PM

Pothula Sunitha Slams Chandrababu Naidu - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరే అంశంపై పార్టీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు

సాక్షి, విజయవాడ : ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు విఫలం అయ్యారని పోతుల సునీత విమర్శించారు. గత 15 నెలలుగా రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు. బీసీలని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు కోసం మాత్రమే వాడుకున్నారని ధ్వజమెత్తారు. గత 20 సంవత్సరాలుగా టీడీపీలో ఉన్న తానే అనేక అవమానాలకు గురి అయ్యానని పోతుల సునీత తెలిపారు.  
(చదవండి : టీడీపీకి షాక్‌: ఎమ్మెల్సీ పదవికి సునీత రాజీనామా)

టీడీపీ వైఖరి అంబేడ్కర్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్‌ పాలన కొనసాగుతోందని ప్రశంసించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాలకు మేలు చేస్తున్నారని, అందుకే ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరే అంశంపై పార్టీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా పోతుల సునీత తన రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్‌కు పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement