టీడీపీకి షాక్‌: ఎమ్మెల్సీ పదవికి సునీత రాజీనామా

Pothula Sunitha Resigned For His MLC Post - Sakshi

సాక్షి, ప్రకాశం : జిల్లా టీడీపీకి పెద్ద షాక్‌ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ఛైర్మన్‌కు తన రాజీనామా పత్రాన్ని పంపారు. రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. టీడీపీ గత కొద్దిరోజులుగా ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను టీడీపీ అడ్డుకుంటోందన్నారు.

చదవండి : ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top