విజయ్‌పై కుట్ర: పోసాని సంచలన వ్యాఖ్యలు | Posani Krishna Murali Sensational Comments On Vijay | Sakshi
Sakshi News home page

విజయ్‌పై కుట్ర: పోసాని సంచలన వ్యాఖ్యలు

May 7 2026 10:38 AM | Updated on May 7 2026 11:35 AM

Posani Krishna Murali Sensational Comments On Vijay

సాక్షి, తాడేపల్లి: తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి, టీవీకే అధినేత దళపతి విజయ్‌పై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ది పాకులాడే మనస్థత్వం కాదన్నారు. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా కుట్రలు చేస్తున్నారని పోసాని ఆరోపించారు. దళపతి విజయ్‌ని అభిమన్యుడిని చేశారంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

తమిళనాడు తాజాగా రాజకీయ పరిణామాలపై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి స్పందించారు. ఈ సందర్బంగా పోసాని మాట్లాడుతూ..‘దళపతి విజయ్ నాకు 1996 నుంచి నాకు తెలుసు. వాళ్ల నాన్నతో కూడా నాకు పరిచయం ఉంది. విజయ్‌ది పాకులాడే మనస్థత్వం కాదు. అతని చుట్టూ ఎన్ని గొడవలు వున్నా కూడా ఎంతో సంయమనంతో ఉన్నాడు. దళపతి విజయ్‌ని అభిమన్యుడిని చేశారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్ర పన్నారు. గవర్నర్ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా గవర్నర్‌ని విజయ్‌ అసలు విమర్శించలేదు’ అని వ్యాఖ్యలు చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement