ఆప్‌ను మీ జన్మలో ఓడించలేరు

PM Modi canot defeat AAP in his lifetime in Delhi, claims Arvind Kejriwal - Sakshi

మోదీకి కేజ్రీవాల్‌ సవాలు

తనను అరెస్టు చేసినా ఆప్‌దే గెలుపని ధీమా

న్యూఢిల్లీ: ‘‘మోదీ జీ! ఢిల్లీలో ఆప్‌ను మీ జన్మలో ఓడించలేరు! అందుకు మరో జన్మ ఎత్తాల్సిందే’’ అంటూ ఆప్‌ జాతీయ కనీ్వనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సవాలు చేశారు. ‘‘నన్ను అరెస్టు చేసినా సరే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో గెలుపు ఆప్‌దే. ఇక్కడ బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు’’ అని జోస్యం చెప్పారు. శుక్రవారం పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

‘‘ప్రాంతీయ పారీ్టల నేతలను ఎలాగైనా అరెస్టు చేసి ఆప్‌ వాటి లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి అడ్డంకులు సృష్టించాలని నరేంద్ర మోదీ సర్కారు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అదే క్రమంలో తన అరెస్టుకు ప్రయతి్నస్తోందన్నారు. కనుక ఒకవేళ అరెస్టయి జైలుకు వెళ్లినా తానే సీఎంగా కొనసాగాలా అని ఇంటింటికీ వెళ్లి ప్రజలను అడగాల్సిందిగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ కుట్రలను వారికి తెలియజెప్పాలన్నారు.

‘‘సీఎంగిరీ మీద నాకేమీ అపేక్ష లేదు. సీఎం అయిన 49 రోజులకే ఎవరూ అడగకపోయినా రాజీనామా చేసింది ప్రపంచంలో బహుశా నేనొక్కడినే. కానీ అరెస్టయినా నేనే సీఎంగా కొనసాగాలని పార్టీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు ముక్త కంఠంతో కోరుతున్నారు’’ అని కేజ్రీవాల్‌ అన్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో పాత్రపై విచారణకు రావాలంటూ కొద్ది రోజుల క్రితం ఈడీ సమన్లివ్వగా ఆయన గైర్హాజరవడం తెలిసిందే.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top