లోకేశ్‌ డైరెక్షన్‌.. పల్లె ఓవరాక్షన్‌

Palle Raghunatha Reddy Overaction With Lokesh Support - Sakshi

రెచ్చిపోయిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

అల్లరి మూకతో కలసి పుట్టపర్తిలో హల్‌చల్‌

చర్చకు సిద్ధమన్న ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిపై తొడగొట్టి వీరంగం

చెప్పులు, రాళ్లు రువ్వుతూ కారు ధ్వంసం

సంయమనంతో ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే

మరోసారి సత్యమ్మ సర్కిల్‌కు వచ్చి రెచ్చిపోయిన పల్లె

సాక్షి, పుట్టపర్తి: ‘ప్రశాంతి నిలయం’గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘు­నాథరెడ్డి అనుచరులతో కలిసి అలజడి సృష్టించారు. శాంతి భద్రతలకు విఘాతం కలి­గిస్తూ..  దౌర్జన్య­కాం­డకు ఒడిగట్టారు. ఫలి­తంగా శనివారం ఉద­యం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పట్ట­ణంలో ఉద్రిక్త వాతా­వరణం నెలకొంది.

ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయ­భ్రాంతులకు గుర­య్యారు. యువగళం పాదయా­త్రలో భాగంగా నారా లోకేశ్‌ గత నెల 25న పుట్టపర్తి నియోజ­క­వర్గం ఓబుళ­దేవరచెరువులో ఎమ్మెల్యే శ్రీధర్‌­రెడ్డిౖ­పె అవి­నీతి ఆరోప­ణలు చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. తాను అవినీతి చేసినట్లు నిరూపించాలని.. అభివృద్ధిపై ఏప్రిల్‌ ఒకటో తేదీన పుట్టపర్తి సత్యమ్మ గుడి వద్దకు చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ఈ నేపథ్యంలో లోకేశ్‌ సూచన మేరకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పందిస్తూ.. తాను చర్చకు వస్తు­న్నానని చెప్పడంతో ఆయన్ను పోలీసులు టీడీపీ కార్యాల­యంలో హౌస్‌ అరెస్ట్‌ చేశారు. శని­వారం ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి సత్యమ్మ గుడి సర్కిల్‌కు చేరుకు­న్నారు. కాసేపటికే పల్లె పోలీసుల నుంచి తప్పించుకుని.. భారీగా అనుచ­రులను వెంటేసుకుని అక్కడికి చేరుకున్నారు.

రండి చూసుకుందాం..
పల్లె అక్క­డికి వచ్చీ రాగానే కారు పైకెక్కి ‘ఎమ్మెల్యే ఎ­క్కడ? నేను చర్చకు సి­ద్ధం’ అంటూ హంగామా చే­శా­రు. వెను­క ఉన్న అను­చ­రు­లు తొడలు కొడుతూ.. మీ­సం మెలేస్తూ ‘రండి రే­య్‌­.. చూసుకుందాం’ అంటూ రెచ్చ­­గొట్టారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే వాహనం  అద్దాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్‌­సీపీ కార్య­కర్తలపై చెప్పులు, రాళ్లు రు­వ్వారు. దీంతో ఆత్మ రక్షణ కో­సం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రతి­ఘటించడానికి పూనుకు­న్నారు. పుట్టపర్తి డీఎస్పీ యశ్వంత్‌ నేతృత్వంలో పోలీ­సులు లాఠీలు ఝుళి­పిస్తూ ఇరు వర్గాల వారిని చెదర­గొట్టారు. ఈ దశలో ఎమ్మెల్యే దుద్దుకుంట తన అను­చరులతో కలిసి ఇంటి కెళ్లిపోయారు. బస్టాండ్‌ వరకు వెళ్లిన పల్లె మళ్లీ సత్యమ్మ గుడి సర్కిల్‌కు చేరుకుని హల్‌చల్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top