వైఎస్సార్‌సీపీకి పొత్తు అవసరమే లేదు: విజయసాయిరెడ్డి

No Alliance For YSRCP Says MP Vijayasai Reddy - Sakshi

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీకి ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి.  ఓటమి భయంతో.. ఎవరికైతే ప్రజల మద్దతు లేదనుకుంటున్నారో..  వాళ్లే పొత్తుల కోసం చూస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారాయన. 

‘‘చంద్రబాబుకు ఎన్నికలలో గెలుస్తామన్న నమ్మకం లేదు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. అసలు ప్రజల్లో ఆయన పట్ల విశ్వసనీయత లేదు. పైగా బాబుది దుర్మార్గపు ఆలోచన. ఎప్పుడూ ఇతరులపైనే ఆధారపడే తత్వం. పైగా వెన్నుపోటు పొడుస్తాడు’’ అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలు చేస్తున్న హత్యలు, అత్యాచారాలను.. ప్రభుత్వానికి అంటగడుతూ బురద జల్లుతున్నారంటూ మండిపడ్డారు. ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా వైఎస్సార్‌సీపీ విజయాన్ని అడ్డుకోలేరన్నారు.  

మరో పాతికేళ్లపాటు వైఎస్సార్‌సీపీనే అధికారంలో ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో ఇంతకు ముందు సాధించిన సీట్లు, ఓట్లు కంటే ఎక్కువ సాధిస్తామని,  వైఎస్‌ జగన్‌ సీఎంగా కొనసాగతారని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి.

చదవండి: రాసిపెట్టుకోండి.. సింహం సింగిల్‌గానే వస్తుంది

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top