ఇజ్రాయెల్‌ నూతన ప్రధాని బెన్నెట్‌ | Naftali Bennett sworn In As Israels New Prime Minister | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ నూతన ప్రధాని బెన్నెట్‌

Jun 14 2021 9:09 AM | Updated on Jun 14 2021 9:54 AM

Naftali Bennett sworn In As Israels New Prime Minister - Sakshi

జెరూసలెం: ఇజ్రాయెల్‌ నూతన ప్రధానిగా యామినా పార్టీ అధ్యక్షుడు నఫ్తాలీ బెన్నెట్‌ (49) ఎన్నికయ్యారు. ఆదివారం ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. పరస్పర విరుద్ధ సిద్దాంతాలు, భావజాలాలతో కూడిన ఎనిమిది పారీ్టల సంకీర్ణ ప్రభుత్వానికి బెన్నెట్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఏ ఒక్క పారీ్టకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో గడిచిన రెండేళ్లలో ఇజ్రాయెల్‌లో నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. 120 సభ్యులుగల ఇజ్రాయెల్‌ పార్లమెంటులో ఈ కూటమికి సరిగ్గా సాధారణ మెజారిటీ (61) ఉంది. కొత్త సంకీర్ణం ఏర్పడటంతో 12 ఏళ్ల కాలంపాటు ఇజ్రాయెల్‌ ప్రధానిగా కొనసాగిన బెంజమిన్‌ నెతన్యాహు పదవీచ్యుతుడయ్యారు. 

నెతన్యాహు పార్టీ లికుడ్‌కు కేవలం 30 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. మెజారిటీని కూడగట్టడంలో నెతన్యాహు విఫలం కావడంతో ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు రువెన్‌ రివ్లిన్‌ రెండో అతిపెద్ద పార్టీ అయిన యెష్‌ అటిడ్‌ (17 సీట్లు) అధినేత లాపిడ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించారు. అయితే లాపిడ్, బెన్నెట్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం...  తొలుత బెన్నెట్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2023 సెపె్టంబరులో లాపిడ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి... ప్రస్తుత పార్లమెంటు పదవీకాలం ముగిసేదాకా, రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. బెన్నెట్‌ మంత్రివర్గంలో తొమ్మిది మంది మహిళలతో సహా మొత్తం 27 మంది మంత్రులు ఉన్నారు. ‘అత్యంత కీలకదశలో మేము బాధ్యత తీసుకున్నాం. భిన్న అభిప్రాయాలనున్న వారిని కలుపుకొని పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నా’ అని బెన్నెట్‌ పార్లమెంటులో మాట్లాడుతూ అన్నారు. ఈ ప్రమాదకరమైన ప్రభుత్వాన్ని పడగొట్టి.. మళ్లీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా పనిచేస్తానని నెతన్యాహు పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement