
దళారులు లేకుండా నేరుగా సంక్షేమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలు ఏపీలో అమలవుతున్నాయన్నారు.
సాక్షి, అమరావతి: దళారులు లేకుండా నేరుగా సంక్షేమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలు ఏపీలో అమలవుతున్నాయన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి లబ్ధిదారుడికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. దీక్ష పేరుతో ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. తన హయాంలో పేదలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రశ్నించారు.
‘‘పేదలకు మేలు జరుగుతుంటే అడ్డుకోవడమే చంద్రబాబు పని. సీఎం వైఎస్ జగన్.. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి, ఇళ్లు కట్టిస్తున్నారు. చంద్రబాబు ఏనాడైనా ఆ ఆలోచన చేశారా?’’ అంటూ డొక్కా మాణిక్య వరప్రసాద్ దుయ్యబట్టారు.