వారు విషం కలిపితే అంతర్జాతీయ కోర్టులో పెట్టి జైల్లో పెడతారు: కొడాలి నాని

MLA Kodali Nani Fires on Chandrababu naidu - Sakshi

సాక్షి, తాడేపల్లి: కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు లోకేష్‌ ఎక్కడ ఎవరు చనిపోయినా టీడీపీ కార్యకర్త అంటూ తిరుగుతున్నాడని అన్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కొడాలి నాని మాట్లాడుతూ.. కుట్రలు, కుతంత్రాలతో ఒళ్లంతా కుళ్లిపోయిన వ్యక్తి చంద్రబాబు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా జగన్‌ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని రథాలను తగలబెట్టడం, విగ్రహాలను పగల గొట్టడం చేశారు.

ఇదే దొంగల ముఠా ఆ తర్వాత కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కోనసీమ చిచ్చు రేపారు. ఎమ్మెల్యే, మంత్రి ఇల్లు తగలబెట్టారు. ఇప్పుడు కొత్తగా మద్యంలో విషం అంటూ ప్రచారం మొదలెట్టారు. ఈనాడు, జ్యోతిలో ముందు ఒక వార్త రాయిస్తారు. మరుసటి రోజు దానిపై గ్లోబల్ తాత చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్ పెడతాడు. మద్యంలో విషం లేదు.. బాటిల్ పైనే హానికరం అని ఉంటుంది. దానికి వీళ్లు ల్యాబ్‌కి వెళ్లి చెక్ చేయించేది ఏంటి?. వీళ్లు ఎవరి వద్ద సర్టిఫికేట్ తెచ్చారు?. టీడీపీ ఆఫీస్‌లో చెక్ చేయించారా?. లోడ్ చెక్ చేసిన తర్వాతే గోడౌన్‌కి వెళ్తుంది. అన్ని బోగస్ మాటలు చెప్పి హడావుడి చేస్తారు అంటూ కొడాలి నాని పేర్కొన్నారు.

చదవండి: (YSRCP Plenary 2022: కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు)

అలా చేస్తే అంతర్జాతీయ కోర్టులో పెట్టి జైల్లో పెడతారు
అరబిందో ఫార్మా 1964లో స్థాపించారు. ఏపీతో పాటు వివిధ ప్రాంతాల్లో 24 మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు వారు ఎగుమతి చేస్తారు. అలాంటి కంపెనీ ఎన్ని ప్రమాణాలు తీసుకుంటుందో ఆలోచించాలి. ఒక్కో దేశంలో ఒక్కో వాతావరణ పరిస్థితి ఉంటుంది. దాన్ని బట్టి మందులు తయారు చేస్తారు. వాళ్లు విషం కలిపితే అంతర్జాతీయ కోర్టులో పెట్టి జైల్లో పెడతారు. దానికి ఒక మెడికల్ కౌన్సిల్ ఉంటుంది. విజయసాయిరెడ్డి వియ్యంకుడుది కాబట్టి విషం కలిపారు అని ఆరోపణ చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో అత్యధిక టాక్స్ కడుతున్నారు. అరబిందో జగన్ బినామీలు అంటాడు.. వాళ్ళు ఎప్పటినుంచి కోటీశ్వరులు?. చారిటబుల్ ట్రస్ట్ పెట్టీ ప్రజలకు సేవ చేస్తున్న వారిని బినామీలు అంటారా?. అసలు చంద్రబాబు మనిషి జన్మ ఎత్తాడా?. దేన్నయినా సర్వనాశనం చేయాలనేది వారి ఉద్దేశ్యం అని కొడాలి నాని అన్నారు.

చదవండి: ('వైఎస్సార్‌సీపీ కోసం అహర్నిశలు పాటుపడుతుంది కార్యకర్తలే')

ఆ పాలల్లో విషం కలపడానికి చంద్రబాబుకు సిగ్గులేదా?
నువ్వు, నీ దత్త పుత్రుడు, దుష్ట చతుష్టయం నా వెంట్రుక కూడా పీకలేరు అన్న మా నాయకుడి మాటకు మేమంతా కట్టుబడి ఉన్నాం. జగన్ ప్రజలను నమ్మి వచ్చాడు.. ఈ రోజు సీఎంగా ఉన్నాడు. నీ ఆటలు ఒకప్పుడు నడిచాయి.. ఇప్పుడు నడవవు. రామోజీరావు చెబితే రాష్ట్రమంతా మారిపోతుందా?. తమిళనాడు, కేరళలో హెరిటేజ్‌ని 2012లో బ్యాన్ చేశారు. దాంట్లో విషం ఉంది. పిల్లలకు మెదడుకు సమస్య అని నిషేధించారు. చిన్నపిల్లలు తాగే పాలల్లో విషం కలపడానికి చంద్రబాబుకి సిగ్గులేదా?. కల్తీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. ఎన్టీఆర్ వారసులమని కల్తీ మాటలు చెప్పుకునే చంద్రబాబే కల్తీ. ఒక నెల రోజులు మీరు గాలి పీల్చినా చచ్చిపోతాడు అని చెప్తారు. విషం ఎక్కడా లేదు.. చంద్రబాబు బుర్రలో నరనరాన విషం ఉంది అని మాజీ మంత్రి, కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top