YSRCP Plenary 2022: కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

MLA Kodali Nani Comments in YSRCP Machilipatnam Plenary - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో బుధవారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశంలో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మచిలీపట్నంలో పేర్ని నాని నిలబడినా.. ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి నిలబడినా అండగా నిలబడాలని కోరారు. బందరులో వారసుడినే గెలిపించాలని, ఇల్లరికం అల్లుడిని (టీడీపీ కొల్లు రవీంద్ర) కాదని అన్నారు.

‘వారసత్వమంటే తాత, తండ్రి, కొడుకు.. అంతే కానీ మామా, అల్లుళ్లు కాదు. వారసత్వమంటే వైఎస్సార్‌.. జగన్‌. సీనియర్‌ ఎన్టీఆర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌. మామ పేరు చెప్పుకునే ఇల్లరికం అల్లుళ్లు మనకెందుకు. రాష్ట్రంలో చంద్రబాబు, బందరులో కొల్లు రవీంద్ర వంటి ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపించండి’ అని కొడాలి నాని నియోజకవర్గ ప్రజల్ని కోరారు. 

చదవండి: (‘సంక్షేమ పథకాల సామ్రాట్‌ సీఎం జగన్‌ ఒక్కరే’)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top