‘వణుకుతున్నారు.. అందుకే గుంపుగా వస్తున్నారు’

Minister Venugopala Krishna Comments On Chandrababu - Sakshi

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ ప్లీనరీ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ, కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నాలుగు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామన్నారు.
చదవండి: పెట్టుబడులపై ఎందుకీ పగ?

‘‘పేదల జీవితం మార్పు కోసం 2017 లో ప్లీనరీ నిర్వహించాం. ఆ ప్లీనరీలో నవరత్నాల మేనిఫెస్టోని ప్రకటించారు. 2019లో 151 స్థానాల్లో గెలిచాం. గడిచిన మూడేళ్లలో 95 శాతం హామీలను నెరవేర్చాం. వైద్య, విద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు సీఎం జగన్‌ నాయకత్వం పట్ల నమ్మకం పెరిగింది. మూడేళ్లలో నేరుగా లబ్ధిదారులకు 1.50 లక్షల కోట్లను డిబిటి ద్వారా అందించాం. ప్రజల నమ్మకాన్ని మరింత పెంచేలా ఈ రెండేళ్ల పాలన ఉంటుంది. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లీనరీ ఉంటుందని’’ మంత్రి  పేర్కొన్నారు.

‘‘రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబుకి స్కూళ్లు అంటే నారాయణ, శ్రీచైతన్య మాత్రమే. నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలని చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచన చేశారా?’’ అంటూ మంత్రి ప్రశ్నించారు.

సీఎం జగన్‌ సంక్షేమ పాలన చూసి ప్రతిపక్షాలు వణుకుతున్నాయి. ఒంటరిగా పోటీ చేయలేక గుంపుగా ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమని ప్రతిపక్షాలకు అర్థమైందని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top