కౌశిక్‌రెడ్డి ప్రవర్తనపై మంత్రి ఉత్తమ్‌ కీలక వ్యాఖ్యలు | Minister Uttamkumarreddy Comments On Mla Kaushikreddy | Sakshi
Sakshi News home page

కౌశిక్‌రెడ్డి ప్రవర్తనపై మంత్రి ఉత్తమ్‌ కీలక వ్యాఖ్యలు

Jan 24 2025 6:22 PM | Updated on Jan 24 2025 7:50 PM

Minister Uttamkumarreddy Comments On Mla Kaushikreddy

సాక్షి,హైదరాబాద్‌:బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ ప్రవర్తనపై  మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పందించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం(జనవరి24) మీడియా చిట్‌చాట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి కార్యక్రమ సమావేశంలో కౌశిక్ రెడ్డి తీరుపై ఉత్తమ్‌ అసహనం వ్యక్తం చేశారు. 

మంత్రిని తాను స్టేజ్‌పై ఉండగానే అల్లరి చేయడం లీడర్ లక్షణం కాదన్నారు.యువ రాజకీయ నాయకుడికి అంత ఆవేశం పనికిరాదు.కౌశిక్‌రెడ్డి తన తీరు మార్చుకోకపోతే రాజకీయ భవిష్యత్తులో ఇబ్బందులు పడతాడు.తనకు కౌశిక్‌రెడ్డికి రాజకీయంగా ఎలాంటి సంబంధాలు లేవని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 

కాగా, ఇటీవల కరీంనగర్‌ డీఆర్సీ సమావేశంలో ఇంఛార్జ్‌ మంత్రిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వేదికపై ఉండగానే కౌశిక్‌రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో గొడవ పెట్టుకోవడమే కాకుండా ఆయనను నెట్టివేశారు. ఇది పెద్ద వివాదానికి దారి తీసింది. 

ఈ గొడవలో కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేయగా అనంతరం కోర్టు ఆయనకు బెయిల్‌ ఇచ్చింది. అంతకు ముందు కూడా బీఆర్‌ఎస్‌ ఫిరాయింపు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి వివాదాస్పద సవాల్‌ విసిరి గొడవకు కారణమయ్యారు.

బీఆర్‌ఎస్‌ వల్లే కృష్ణాజలాల్లో తెలంగాణకు అన్యాయం...ఉత్తమ్‌కుమార్‌

  • కృష్ణానది జలాల వాటల్లో తెలంగాణకు అన్యాయం బీఆర్‌ఎస్‌ (BRS) వల్లే జరిగింది
  • నీళ్ల విషయంలో ప్రభుత్వం పై హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • నీళ్ల కోసం బీఆర్‌ఎస​ కొట్లాడినట్లు హరీష్ రావు వ్యాఖ్యలు ఉన్నాయి.
  • హరీష్ రావు-కేసీఆర్ నిర్ణయాల వల్ల ఇరిగేషన్ శాఖ కోలుకోలేని విధంగా తయారు అయింది.
  • బనకచర్ల ప్రాజెక్టులో హరీష్ రావు అన్నట్లు 200 టీఎంసీలు తరలిపోతున్నాయి అనేది అవాస్తవం.
  • ఏపీ ఒక లేఖ మాత్రమే రాసింది...దానికి వెంటనే కౌంటర్ లేఖ రాశాము
  • కేసీఆర్ చేసిన తప్పిదాలను మేము సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.
  • నీటి వాటాల్లో తెలంగాణ 299 టీఎంసీ-512టీఎంసీకి కేసీఆర్ ఒప్పుకున్నారు.
  • ఇప్పుడు మేము మొత్తం 811 టీఎంసీలో 70శాతం తెలంగాణాకు, 30శాతం ఏపీకి ఇవ్వాలని కోరుతున్నాం.
  • నీళ్లను ఏపీకి అప్పగించి...ఇవ్వాళ దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నారుఘై
  • ఐఏఎస్‌ అధికారిని తప్పుపట్టడం కరెక్ట్ కాదు...బీఆర్‌ఎస్‌ వ్యాఖ్యలు చిల్లర రాజకీయాలే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement