‘చంద్రబాబు మరోసారి నీచ బుద్ధి బయటపెట్టాడు’

Minister Kottu Satyanarayana Takes On Chandrababu Naidu - Sakshi

ఏలూరు: దిగజారిపోయిన నీచుడు చంద్రబాబు నాయుడు మరోసారి తన దుర్మార్గమైన బుద్ధిని బయటపెట్టాడని మంత్రి కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఇంతకుముందు కూడా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికొపోయిన చంద్రబాబు.. పారిపోయి అక్రమ బిల్డింగ్‌ దాక్కున్నాడని మంత్రి విమర్శించారు. ఎవరైనా దిగజారిపోయిన రాజకీయాలు చేయాలనుకుంటే తన దగ్గరకు వచ్చి నేర్చుకోవాలనే విధంగా తన బుద్ధి బయటపెట్టాడని మండిపడ్డారు. రూ. 10 కోట్లు ఒక శాసనసభ్యుడికి ఆఫర్‌ చేసి దొరికిపోయిన చంద్రబాబు.. మళ్లీ ఏదో గెలిచామని సంబరాలు చేసుకుంటున్నాడని మంత్రి మండిపడ్డారు.

పశ్చిమగోదావిరి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ.. గతంలో ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కేసు పెడితే హైదరాబాద్‌ నుంచి రాత్రికి రాత్రి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు..నేడు మళ్లీ బ్యాక్‌డోర్‌ పాలిటిక్స్‌కు తెరలేపాడన్నారు. నాడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొని పార్టీని ఇబ్బంది పెట్టాలని చూశాడు. నేడు రాపాక వరప్రసాద్ నుకొనుగోలు చేయాలని ఉండి ఎమ్మెల్యే ఆయన  అనుచరులతో ప్రయత్నం చేశారు. బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేయడం కో చంద్రబాబు సిద్దహస్తుడు . ప్రజా స్వామ్యం లో ఓటు హక్కు విలువైనది.చంద్ర బాబు ఎమ్మెల్యే లను సైతం కొనుగోలు చేసే స్థాయికి దిగజారడం దురదుష్టకరం. నాడు అధికారంలో ఉండి చేశాడు నేడు ప్రతి పక్ష నేత గా చంద్రబాబు అదేపని చేస్తున్నాడు. సీఎం జగన్‌ ఇలాంటి ప్రలోభాలకు పూర్తి వ్యతిరేకం. నాడు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్లినా, నేడు నలుగురు వెళ్లినా సీఎం జగన్‌ పట్టించుకోరు’ అని స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top