‘మమతా అంటేనే అసహనం’

Mamata Banerjee Name Is Intolerance BJP Chief JP Nadda Says - Sakshi

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. మమతా బెనర్జీ అంటేనే అసహనానికి పర్యాయపదంగా మారిపోయిందన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) పభుత్వంలో అసహనం ఘోరంగా పెరిగిపోయిందన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఆయన కోల్‌కతాకు చేరుకున్నారు. వివిధ ఏరియాల్లో తొమ్మిది పార్టీ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. టీఎంసీ కుటుంబ పార్టీ అని, అక్కడ నాయకుల వారసులే రాజకీయాల్లోకి వస్తారన్నారని విమర్శించారు.
(చదవండి : కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు)

కానీ బీజేపీలో వారసులు ఉండరని, పార్టీయే తమకు కుటుంబం అన్నారు. బెంగాల్‌తో బీజేపీకి ఎంతో అనుబంధం ఉందన్నారు. బీజేపీ ఇద్దరు జాతీయ అధ్యక్షులను అందించిన రాష్ట్రం బెంగాలేనని కొనియాడారు. బెంగాల్‌ రక్షించేందుకు కమలదళం సిద్ధంగా ఉందన్నారు. మమతా హయంలో అభివృద్ధి కంటే అరాచకాలే ఎక్కువ జరుగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో అసహనం పెరిగిపోయిందని, సీఎం మమతా బెనర్జీ అంటేనే అసహనం అన్న విధంగా పాలన జరుగుతుందని ఎద్దేవా చేశారు. 2021 ఎన్నికల్లో 200 స్థానాలకు పైగా విజయం సాధించి బీజేపీ ప్రభుత్వాని ఏర్పాటు చేస్తుందని నడ్డా ధీమా వ్యక్తం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top