వాటికి లైసెన్స్‌ ఫీజు అక్కర్లేదు: కేంద్ర మంత్రి

Center To Launch PM Wi Fi Access Network Interface - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో త్వరలోనే పబ్లిక్‌ డేటా సెంటర్లు ప్రారంభం కానున్నాయని కేంద్ర ఐటీ, న్యాయ శాఖా మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ అన్నారు. వీటికి ఎటువంటి లైసెన్స్‌, ఫీజు, రిజిస్ట్రేషన్‌ అవసరం లేదని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పబ్లిక్‌ డేటా సెంటర్ల ద్వారా వైఫై సేవలు అందించేందుకు వీలుగా రూపొందించిన పీఎండబ్ల్యూఏఎన్‌ఐ(పీఎం- వైఫై యాక్సెస్‌ నెట్‌వర్క్‌ ఇంటర్‌ఫేస్‌)కు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి మీడియాకు వెల్లడించారు. ‘‘పీఎండబ్ల్యూఏఎన్‌ఐని ప్రారంభించాలని కేబినెట్‌ నిర్ణయించింది.  దేశంలో పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌ల వృద్ధిని ఇది ప్రోత్సహిస్తుంది.

కొచ్చి- లక్షద్వీప్‌ మధ్య సబ్‌మెరైన ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ కనెక్టివిటీ ఏర్పాటు ప్రొవిజన్‌కు ఆమోదం తెలిపింది’’ అని రవిశంకర్‌ పేర్కొన్నారు. అదే విధంగా ఈశాన్య ప్రాంతానికి సమగ్ర టెలికాం అభివృద్ధి ప్రణాళిక ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌, అసోంలోని రెండు జిల్లాల్లో మొబైల్ కవరేజ్ అందించడానికి యుఎస్ఓఎఫ్ పథకాన్ని కేంద్ర మంత్రి మండలి ఆమోదించినట్లు తెలిపారు. అంతేగాక ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 1584 కోట్లు, 2020-2023 కాలానికి గానూ రూ. 22.810 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. దీని ద్వారా సుమారు 58.5 లక్షల మందికి లబ్ది చేకూరనుంది.(చదవండి: రైతులతో చర్చలు: కేంద్రం ప్రతిపాదనలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top