చపాతీలు చేయడం నేర్చుకోండి: బీజేపీకి ఎన్సీపీ ఘాటు రిప్లై

Maharashtra: Vidya Chavan Counter To BJP president Chandrakant Patil - Sakshi

సాక్షి, ముంబై: రాజకీయాలు చేయడానికి బదులు ఇంటికెళ్లి వంట చేసుకోండి అని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేను ఉద్దేశిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలపై నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) తీవ్రంగా మండిపడింది. ఎన్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు విద్యా చవాన్‌ గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాలకు బదులుగా చంద్రకాంత్‌ పాటిల్‌ చపాతీలు చేయడం నేర్చుకోవాలని, ఇంటికెళ్లి ఆయన భార్యకు సాయపడతారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై బీజేపీ బుధవారం ముంబైలో నిర్వహించిన ఆందోళనలో సుప్రియా సూలేపై చంద్రకాంత్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

ఇటీవల మధ్యప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో..ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ ఢిల్లీ పర్యటించినప్పుడు సుప్రియా సూలే ఆయన వద్దకు వెళ్లి కలిశారని, స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు అనుమతించేందుకు ఏం చేశారని మాత్రం ఆయనను అడగలేకపోయారని విమర్శిస్తూ పాటిల్‌ సుప్రియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై విద్యా చవాన్‌ స్పందిస్తూ చంద్రకాంత్‌ పాటిల్‌ మనుస్మృతిని బలంగా నమ్ముతారని తెలుసని అయితే ఈ విషయంలో మేం ఇక ఏమాత్రం మౌనంగా ఉండదలుచుకోలేదని హెచ్చరించారు. 
చదవండి: లైంగిక ఆరోపణలు.. మన‌స్తాపంతో మాజీ మంత్రి ఆత్మహత్య

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top