ఛలో మేడిగడ్డ: కాంగ్రెస్‌ సర్కారుపై కేటీఆర్‌ ఫైర్‌

Ktr Comments On Kaleswaram While Going To Chalo Medigadda - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం బాధ్యత మరచి ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలు చెప్పడానికే  తమ పార్టీ ఛలో మేడిగడ్డ పర్యటన అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఛలో మేడిగడ్డకు బయలుదేరుతూ శుక్రవారం ఉదయం కేటీఆర్‌ సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.  రైతు ప్రయోజనం కంటే రాజకీయ ప్రయోజనమే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని విమర్శించారు. 

ఛలో మేడిగడ్డ పర్యటన మొదటిది మాత్రమేనని, దీని తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పర్యటిస్తామని చెప్పారు. కావాలంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మేడిగడ్డ రిపేర్‌ చేయడానికి ఉన్న ఇబ్బందేంటని కేటీఆర్‌ ప్రశ్నించారు. రిపేర్‌ చేయకుండా ఉంచి వర్షాకాలంలో వరద  వచ్చి బ్యారేజీ కొట్టుకుపోవాలని చూస్తున్నారన్నారు. రాజకీయాల కోసం రైతులను బలి చేయొద్దని సూచించారు.  

ఎడారిగా మారుతున్న తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు, కరువును పారలడం కోసం కాళేశ్వరంప్రాజెక్ట్‌ను నిర్మించారని మాజీ స్పీకర్‌, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. దీన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు ఆ ప్రాజెక్ట్‌పై విషం చిమ్ముతున్నారన్నారు. రైతులపై ప్రభుత్వానికి ఏ మాత్రం ప్రేమ ఉన్నా మేడిగడ్డ రిపేర్‌ చేసి నీటిని మళ్లించాలని డిమాండ్‌ చేశారు. 

ఇదీ చదవండి.. వచ్చే వారం మేడిగడ్డకు ఎన్‌డీఎస్‌ఏ బృం‍దం

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top