వారికి ప్రైవేటు రంగంలో 75% రిజర్వేషన్లు

Haryana reserves 75% of private sector jobs for local residents - Sakshi

చంఢీఘడ్: నిరుద్యోగులుకి ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించేందుకు హరియాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిరుద్యోగులుకి ప్రైవేటు రంగంలో 75% రిజర్వేషన్లు ఇచ్చే బిల్లును గురువారం ఆమోదించింది. ఉప ముఖ్యమంత్రి, జేజేపీ నాయకుడు దుష్యంత్ చౌతాలా అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా.. కాంగ్రెస్, జానాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతం వ్యక్తం చేశారు. అయినప్పటికి ప్రభుత్వం బిల్లును ఆమోదించింది. నెలకు 50,000 రూపాయల కన్నా తక్కువ జీతం ఉన్న ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానిక అభ్యర్థులకు 75% కొత్త ఉపాధిని కల్పించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ( ఉద్యోగులకు దీపావళి కానుక : ఒక నెల బోనస్‌ )

ప్రభుత్వ నిర్ణయంతో ప్రైవేటు కంపెనీలు, సంఘాలు, ట్రస్టులు, భాగస్వామ్య సంస్థలు మొదలైన వాటిలో స్థానికులకు ఉపాధి దొరకనుంది. స్థానిక యువతకు ఉపాధి అవకశాలు పెంచేందుకు ఈ బిల్లు తీసుకువచ్చినట్టు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అన్నారు. దుష్యంత్ చౌతాలా ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. "ఈ రోజు హరియాణలోని లక్షలాది మంది యువతకు ప్రైవేట్ రంగంలో 75 శాతం ఉద్యోగాలు లభిస్తాయి" అని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top