‘ఎన్నికల్లో కోదండరాంకు మద్దతు ఇవ్వలేం’

Graduate MLC: Congress Leaders Not Interested To Support Kodandaram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్‌ నేతలు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్‌ మానిక్కం ఠాగూర్‌ అధ్యక్షతన గాంధీభవన్‌లో ఆదివారం ఈ సమావేశం జరిగింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీపడుతున్న కోదండరాంకు మద్దతుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికే టికెట్ ఇవ్వాలని జిల్లాల కాంగ్రెస్‌ నేతలు కోరుతున్నారు. ఇతర పార్టీలకు మద్దతు ఇస్తే పార్టీ క్యాడర్ దెబ్బతుంటుందని పార్టీ ఇంచార్జ్‌ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. బలమైన అభ్యర్థిని మనమే నిలబెడదామని అన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియలో స్థానిక నాయకత్వం చొరవ తీసుకోవాలని మానిక్కం ఠాగూర్ ఈ సందర్భంగా సూచించారు.

కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభలో కాంగ్రెస్‌ పక్ష నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ నేతలు దామోదర రాజనర్సింహ, షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు. దీంతోపాటు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌ నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఖమ్మం-వరంగల్‌-నల్గొండ, హైదరాబాద్‌-రంగారెడ్డి-ఉమ్మడి మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల పదవీకాలం 2021 మార్చి 29 నాటికి పూర్తి కానుంది. గడువు ముగిసేలోపే ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు నమోదు కార్యక్రమానికి ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీచేసింది. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అర్హులైన వారు నమోదు చేసుకోవాలని పేర్కొంది.
(చదవండి: ప్రతిష్టాత్మకంగా పట్టభ్రదుల ఎమ్మెల్సీ ఎన్నికలు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top