ఏంటీ పరిస్థితి..! ఆశలు సమాధి.. అక్కడా ‘చేయి’చ్చారు

Goa Election Results 2022: BJP Confident of Forming Govt, Congress Towards Defeat - Sakshi

నాలుగు రాష్ట్రాల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న కాంగ్రెస్‌కు గోవాలోనూ ఆశలు గల్లంతయ్యాయి. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌ రాష్ట్రాల్లో చేతులెత్తేసిన గ్రాండ్‌​ ఓల్డ్‌ పార్టీ.. గోవాలోనైనా అధికారంలోకి వచ్చి పరువు కాపాడుకోవాలని ప్రయత్నించగా అక్కడా నిరాశే ఎదురైంది. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ కేవలం 12 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 20 స్థానాలు గెలిచింది. మెజారిటీకి అడుగు దూరంలో నిలిచింది. అయితే, స్వతంత్రులుగా గెలిచినవారిలో ముగ్గరు తమకు మద్దతు ఇస్తారని కమళ దళం ఇప్పటికే ప్రకటించింది. గోవాలో అధికారాన్ని తిరిగి చేపడతామని స్పష్టం చేసింది.

ఇక గోవాలో హంగ్‌ ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాలుండగా ప్రభుత్వం ఏర్పాటుకు 21 సీట్లు రావాల్సి ఉంది.. అయితే ఇప్పటికే గోవాలో 20 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. కాంగ్రెస్‌ 12 స్థానాలు గెలుచుకుంది. టీఎంసీ రెండు స్థానాలు, ఆప్‌ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఇతరులు నాలుగు స్థానాలు గెలుచుకున్నారు.  కాగా ఒక్క ఇండిపెండెంట్‌ను లాక్కోగలిగినా బీజేపీ సర్కార్‌ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో గోవాలో ప్రభుత్వ ఏర్పాటులో టీఎంసీ, ఇండిపెండెట్లే కీలకం కానున్నారు. మరోవైపు ఉన్న ఎమ్మెల్యేలనైనా కాపాడుకునేందుకు తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ నేతలు రిసార్ట్‌కు తరలించారు.
చదవండి: ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాహుల్‌ గాంధీ.. ఏమన్నాడంటే..

గోవాలో మ్యాజిక్‌ఫిగర్‌కు చేరువలో బీజేపీ ఆగిపోవడంతో ప్రభుత్వ ఏర్పాట్లలో కమలనాథులు నిమగ్నమయ్యారు. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదన సమర్పించాలని భావిస్తోన్న బీజేపీ ఇప్పటికే గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరింది. మరోవైపు  బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతుందని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ అంటున్నారు. మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ సహా స్వతంత్రుల మద్ధతు తమకే ఉందని ప్రమోద్‌ సావంత్‌ ధీమా వ్యక్తం చేశారు.
చదవండి: సీఎంను ఓడించిన సామాన్యుడు.. ఎవరతను?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top