
సాక్షి, కరీంనగర్ : హుజురాబాద్‌లో తన విజయాన్ని ఎవరూ ఆపలేరని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ‘నేను దిక్కులేని వాడ్ని కాదు.. హుజురాబాద్ ప్రజల హృదయాల్లో ఉన్న బిడ్డను. నేను వాళ్ల గుండెల్లో ఉన్నా. నన్ను ఓడించేందుకు రూ.5 వేల కోట్లైనా ఖర్చు పెడతారట. రేపు ఎన్నికల్లో చూసుకుందాం. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుకు సవాల్. దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవండి’’ అని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఈటల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.