
సాక్షి, హైదరాబాద్: పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 11న రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంక్‌ల ముందు ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. 5 నెలల్లోనే 43 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని, దీనికి నిరసనగా కోవిడ్ నిబంధనల అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని మంగళవారం ఓ ప్రకటనలో కోరారు.