ఆహ్వానించినందుకు ధన్యవాదాలు!.. కానీ రాలేను: కాంగ్రెస్‌ ఎంపీ

Congress MP Thanked Punjab CM Inviting His Swearing Ceremony - Sakshi

న్యూఢిల్లీ: భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్‌లో పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, తదితరుల సమక్షంలో భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి ఆహ్వానం లేదు. ఈ మేరకు కాంగ్రెస్‌ ఎంపీ మనీష్ తివారీ ట్విట్టర్‌లో మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భగవంత్ మాన్‌ను నేను అభినందిస్తున్నాను. ఆయన ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

పార్లమెంటు సమావేశాలు ఉన్నందున నేను హాజరు కాలేక పోతున్నాను. కానీ పంజాబ్‌ మాజీ ముఖ్య మంత్రి చరణ్‌జిత్ సింగ్‌ నన్ను ఆహ్వానించకపోవడం విడ్డూరం." అని తివారీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే పంజాబ్‌లోని ఆనంద్‌పూర్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ సాహిబ్ కూడా పార్లమెంటు సమావేశాలు ఉన్నందున తాను వేడుకకు హాజరు కాలేనని చెప్పారు. అంతేకాదు తివారీ పంజాబ్‌ సీఎం ఆహ్వాన కార్డును కూడా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలోని 117 స్థానాలకు గానూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 92 స్థానాలతో భారీ విజయాన్ని నమోదు చేసింది.  కాంగ్రెస్ 18 సీట్లకు పరిమితమైంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌ స్పష్టమైన ఓట్ల చీలికను చవి చూసింది.  అయితే తివారీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన లేరు. అయితే  భగవంత్ మాన్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్దగా కేంద్ర మంత్రి లేదా జాతీయ స్థాయిలోని పెద్ద నాయకులెవరిని ఆహ్వానించ లేదు. 

(చదవండి: రెండోసారి సీఎంలుగా ప్రమోద్‌ సావంత్‌, బీరేన్‌ సింగ్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top