రెండోసారి సీఎంలుగా ప్రమోద్‌ సావంత్‌, బీరేన్‌ సింగ్‌

Current Chief Ministers In Goa And Manipur Will Get Second Terms - Sakshi

న్యూఢిల్లీ: గోవా, మణిపూర్‌ ముఖ్యమంత్రులుగా ప్రమోద్‌ సావంత్‌, ఎన్‌ బీరేన్‌ సింగ్‌ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. అంతేగాదు గోవా, మణిపూర్‌లలో ప్రస్తుత ముఖ్యమంత్రులు అయిన ప్రమోద్ సావంత్, ఎన్ బీరేన్ సింగ్‌లు మళ్లీ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. హోలీ తర్వాత ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుందని వెల్లడించారు.

ఇద్దరు నేతలు ఇవాళ ప్రధాని మోదీని కలిశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లో నాయకత్వానికి ఎలాంటి సందేహం లేకపోయినా గోవా, మణిపూర్‌లలో ఉన్నత పదవులపై ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు గోవాలో 40 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 20 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌ను 11 సీట్లకు పరిమితం అయ్యింది. దాంతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అలాగే మణిపూర్‌లో ఇతర పార్టీలను సింగిల్ డిజిట్‌ను దక్కించుకోవడంతో బీజేపీ మెజారిటీ ఓట్లతో ఆధిక్యంలో నిలిచింది. అంతేగాదు మణిపూర్‌లోని 60 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ ఒంటరిగా పోటీ చేసి 32 స్థానాల్లో విజయం సాధించింది.

(చదవండి: రాజకీయాల్లో వారికి నా వల్లే టికెట్‌ రాలేదు.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top