
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: బీజేపీ పాలనలో దేశంలో గంటకో రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడంటూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం ధ్వజమెత్తింది. ‘‘2021లో 10,881 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అంటే సగటున రోజుకు 30 మంది. గంటకొకరన్నమాట. 2014–21 మధ్య 54 వేల రైతు ఆత్మహత్యలు జరిగినట్టు నేసనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో గణాంకాలే చెబుతున్నాయి.
2022కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని బీజేపీ ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ ఇప్పుడు వారికి రోజుకు కేవలం 27 రూపాయలు గిడుతోంది’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే అన్నారు.