అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు సరికావు: బూడి ముత్యాలనాయుడు | Budi Mutyala Naidu Serious Comments On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘టీడీపీ నేతల తీరుతోనే గుంటూరులో​ అమాయకులు బలయ్యారు’

Jan 20 2023 5:53 PM | Updated on Jan 20 2023 7:14 PM

Budi Mutyala Naidu Serious Comments On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌పై డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సీరియస్‌ అయ్యారు. చంద్రబాబు, లోకేశ్‌ కంటే పెద్ద సైకోలు ఎవరూ లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా, బూడి ముత్యాలనాయుడు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు ప్రజాసంక్షేమం అవసరం లేదు. గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి తేడా చూడండి. జన్మభూమి కమిటీల పేరుతో గత ప్రభుత్వం దోచుకుంది. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు సరికావు. మూడున్నర ఏళ్ల కాలంలో ప్రజల కోసం ఎప్పుడైనా మాట్లాడారా?. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన చూసి ఓర్వలేకపోతున్నారు. ఐదేళ్లలో టీడీపీ చేసిన దోపిడీకి ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పారు. 

ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా సీఎం వైఎస్‌ జగన్‌ సుపరిపాలన అందిస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98 శాతం అమలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ అందిస్తున్న పథకాఉ గతంలో ఎవ్వరూ ఇవ్వలేదు. అయ్యన్న పోలీసులపై ఇష్టానుసారం మాట్లాడతారా?. టీడీపీ నేతల మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. టీడీపీ నేతల తీరుతోనే గుంటూరులో​ అమాయకులు బలయ్యారు. నోరు అదుపులో పెట్టుకొని మాటలు మాట్లాడాలి. 650 హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది చంద్రబాబు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement