లిక్కర్‌ స్కాంపై పెదవి విప్పరెందుకు? 

BSP Chief RS Praveen Kumar Lashes Out Kalvakuntla Kavitha Over Delhi Liquor Scam - Sakshi

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌   

ఖమ్మం/మామిళ్లగూడెం: ప్రతి అంశంపై మీడియా సమావేశాలు పెట్టి గంటల తరబడి మాట్లాడే సీఎం కేసీఆర్‌.. లిక్కర్‌ స్కాంపై ఎందుకు పెదవి విప్పడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. తన కూతురు కవితను లిక్కర్‌ స్కాం నుంచి కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

శ్రీకాంతాచారి వంటి ఎంతోమంది అమరులు సాధించిన తెలంగాణ నేడు స్కాంలకు నిలయంగా మారిందన్నారు. రాష్ట్రంలో మోసాలు, అవినీతి పెరిగిపోయాయని, సీబీఐ కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న కేసులకే అరెస్టు చేసి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించే అధికారులు, కవిత విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆధారాలు కూడా దొరకకుండా మొబైల్‌ ఫోన్లను ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. బీజేపీకి చెందిన బీఎల్‌ సంతోష్‌ రూ.వందల కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తే ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు. ఆపరేషన్‌ ఆకర్‌‡్ష రాజ్యాంగ విరుద్ధమన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top