
సాక్షి,సూర్యాపేట జిల్లా: రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సీఎం స్థాయిని దిగజార్చేలా ఉన్నాయని, రాష్ట్ర ప్రజల పరువు పోయేలా ఆయన ఉపన్యాసాలుంటున్నాయని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు.శుక్రవారం(అక్టోబర్ 18)సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ఎవరో రాసిచ్చిన పాఠం చదవడం రేవంత్ మానేస్తే మంచిది. తెలంగాణ ఆదాయం పెంచింది కేసీఆర్. 2014 బడ్జెట్‌ను ఇప్పటి బడ్జెట్ పోల్చి చూస్తే ఎవరు ఆదాయం పెంచారో తెలుస్తుంది. అప్పులు మంత్రుల జేబులో నుంచి కడుతున్నట్లు అతితెలివిగా మాట్లాడుతున్నారు.
420 హామీలొద్దు. కనీసం కేసీఆర్ ఇచ్చిన పథకాలైనా ఇస్తే చాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ఆదాయం,అప్పులపై చర్చకు మేం సిద్ధమే. సెక్యూరిటీ లేకుండా సీఎం మూసీ ప్రాంతంలో తిరిగి చూపించాలి. మూసీ కూల్చివేతల తర్వాత సెక్యూరిటీ పెంచుకుని ప్రగల్భాలు పలుకుతున్నారు. అశోక్ నగర్ పేరు వింటే రేవంత్‌కు భయమేస్తోంది. సీఎం ఏకపక్షంగా వెళుతున్నారని కాంగ్రెస్ సీఎంలే అంటున్నారు.
ఇదీ చదవండి: మెగాస్టార్,సూపర్‌స్టార్‌ను మించిన నటుడు రేవంత్: హరీశ్‌రావు