Punjab Elections 2022: నన్ను కాదని సోనూసూద్‌ సోదరికి సీటిచ్చారు..! అందుకే బీజేపీలోకి..: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

BJP Vs Congress Punjab Congress MLA Unhappy That His Seat Was Given To Malvika Sood - sakshi - Sakshi

చంఢీగడ్‌: రాష్ట్ర ఎన్నికలకు కొన్ని వారాల ముందు తనకివ్వవలసిన సీటును నటుడు సోనూసూద్ సోదరి మాళవికా సూద్‌కు ఇవ్వడం పట్ల అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్జోత్ కమల్ శనివారం బీజేసీ కండువ కప్పుకున్నారు. అనంతరం పంజాబ్‌లోని మోగా నుండి చంఢీగడ్‌లోని బీజేసీ ఆఫీస్‌కు చేరుకున్న కమల్‌ మీడియాతో మాట్లాడుతూ..

‘ఎన్నికల టికెట్‌ ఇవ్వకపోవడం నన్ను అవమానించడమేనని’ బీజేపీలో చేరిన అనంతరం మీడియాతో అన్నారు. రాష్ట్రంలో మరో స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ అధీష్టానం తనను కోరిందని, కాంగ్రెస్‌ తనని అవమానించినట్టు భావించి తిరస్కరించానని చెప్పుకొచ్చారు. ‘మోగాను సందర్శించేందుకు సిద్ధూ సాహెబ్‌ వచ్చినప్పుడు కూడా మా ఇంటికి రాకుండా, నేరుగా మాళవికా సూద్‌ ఇంటికి వెళ్లాడన్నారు. కాంగ్రెస్‌ మాళవిక సూద్‌ను ఎంపిక చేసుకోవడం పట్ల నాకెటువంటి అభ్యంతరం లేదు. మోగా నుంచి నాకు సీటు ఇవ్వకపోవడమే నాకు బాధగా ఉంది. మాళవిక నాకు సోదరి లాంటిది. ఐతే ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండానే కేవలం సోనూ సూద్‌ సోదరి అయిన కారణంగా సీటు ఇచ్చారు. యూత్‌ కాంగ్రెస్‌ వర్కర్‌గా ప్రారంభించి, శిరోమణి అకాలీ దల్‌ కంచుకోటను బద్ధలు కొట్టి, మోగాలో కాంగ్రెస్‌ స్థాపనకు కఠోర శ్రమ పడ్డాను. దాదాపు 21 ఏళ్లగా కాంగ్రెస్‌కు చేసిన సేవ పార్టీ పట్టించుకోలేదని’ వాపోయారు.

కాగా గత సోమవారం మాళవికా సూద్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే! ఫిబ్రవరి 14 న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో జరగనుండగా,  ఫలితాలు మార్చి 10 న వెలువడనున్నాయి.

చదవండి: Omicron Alert: ప్రతి ఆదివారం పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top