
సాక్షి,హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం(సెప్టెంబర్8) ఈ విషయమై రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. ఒవైసీ కాలేజీ ఎప్పుడు కూలుస్తున్నారో సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఒవైసీ కాలేజీ కూల్చకపోతే హైడ్రా విఫలమైనట్లేనన్నారు. ఒకవేళ కూలిస్తే రేవంత్ హీరో అవుతారన్నారు. ఒవైసీ కాలేజీ కూల్చివేతపై జాప్యం చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.
ఇదీ చదవండి.. హైడ్రా కూల్చివేతలు.. మాదాపూర్‌లో ఉద్రిక్తత