సీఎంపై సభాహక్కుల నోటీస్‌ పరిశీలిస్తున్నాం

BJP MLA Raghunandan Rao Comments Over Telangana CM KCR - Sakshi

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీలో దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని ప్రకటించి ఇప్పుడు వెనక్కు తగ్గిన సీఎం కేసీఆర్‌పై సభాహక్కుల ఉల్లంఘన నోటీస్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు తెలిపారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పలేదని సీఎం అవాస్తవాలు మాట్లాడారని, భగ వద్గీత, ఖురాన్, బైబిల్‌పై సీఎం ప్రమాణం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు.

ఆ విధంగా చేయ లేని పక్షంలో టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీ తప్పుగా ప్రచురితమైందని, దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి సిద్ధంగా లేమని చెప్తారా అని నిలదీశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో అప్పటి మంత్రి కోనేరు రంగారావు అధ్యక్షతన సభాసంఘం సమ ర్పించిన నివేదికను శాసనసభ ఎదుట ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. దాదాపు ఏడేళ్ల క్రితమే రాష్ట్రంలో కులాల వారీగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఎందుకు బయట పెట్టడంలేదో చెప్పాలన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top