AP Minister RK Roja Comments On Pawan Kalyan - Sakshi
Sakshi News home page

సినిమాల్లో గబ్బర్‌ సింగ్‌.. రాజకీయాల్లో రబ్బర్‌ సింగ్‌: మంత్రి రోజా

Jan 14 2023 5:49 PM | Updated on Jan 14 2023 6:40 PM

AP Minister RK Roja Comments On Pawan Kalyan - Sakshi

చంద్రబాబు, పవన్‌కు పదవులే ముఖ్యం. 2 చోట్ల ఓడిన పవన్‌ను చూసి ఎవరూ భయపడరు. పవన్‌ సినిమాల్లోనే గబ్బర్‌ సింగ్‌.. రాజకీయాల్లో రబ్బర్‌ సింగ్‌’’ అని రోజా ఎద్దేవా చేశారు.

సాక్షి, తిరుపతి: చంద్రబాబు సైకోకు పరాకాష్టగా మారారని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఆదివారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, ‘‘జనం రాకపోవడంతో రోడ్లపై సభలు పెడుతున్నారు. చంద్రబాబు, పవన్‌కు పదవులే ముఖ్యం. 2 చోట్ల ఓడిన పవన్‌ను చూసి ఎవరూ భయపడరు. పవన్‌ సినిమాల్లోనే గబ్బర్‌ సింగ్‌.. రాజకీయాల్లో రబ్బర్‌ సింగ్‌’’ అని రోజా ఎద్దేవా చేశారు.

‘‘పవన్‌ ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేడు. నన్ను డైమండ్‌ రాణి అన్నారు.. నేను నిజంగా రాణినే. ఇంట్లో, రాజకీయంగా, నటిగా నన్ను నేను నిరూపించుకుని రాణిలా ఉన్నాను. మరోసారి పవన్‌ నా గురించి మాట్లాడితే బాగుండదు. చిరంజీవికి నాకు ఎలాంటి గొడవలు లేవు’’ అని మంత్రి రోజా స్పష్టం చేశారు.

‘‘సీఎం జగన్‌ అన్ని రంగాలలో అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నారు. అందుకే అన్నీ పార్టీలు గుంపులుగా వస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ 175 సాధిస్తారు. సింహం సింగిల్‌గానే వస్తుంది’’ అని మంత్రి ఆర్కే రోజా అన్నారు.
చదవండి: కొడాలి నాని వల్లే నేనీ స్థాయిలో ఉన్నా: వివి వినాయక్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement