కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి చేరికలు

AP Leaders Joined The BRS Party CM KCR Interesting Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్‌ పార్టీలోకి సోమవారం చేరారు. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, తోట చంద్రశేఖర్, పార్థసారధి బీఆర్‌ఎస్‌లోకి చేరారు. సీఎం కేసీఆర్‌ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ అజెండాను దేశవ్యాప్తం చేయాలన్నారు. పార్టీలో చేరిన నేతలపై పెద్ద బాధ్యత పెడుతున్నామన్నారు. భారతదేశంలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదన్నారు.

‘‘స్వాతంత్య్ర ఫలాలు పూర్తిస్థాయిలో సిద్ధించలేదు. భారతదేశ లక్ష్యాలు ఇంకా నెరవేరలేదు. ఒకప్పుడు రాజకీయాలు అంటే త్యాగం చేయాల్సి ఉండేది. దేశ రాజధానిలో రైతులు ధర్నాలు చేయడం చూస్తున్నాం. వనరులు, వసతులు ఉండి దేశ ప్రజలు ఎందుకు శిక్షింపబడాలి?. బీఆర్‌ఎస్‌  ఈజ్‌ ఫర్‌ ఇండియా’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top