రాజకీయాల్లో ముద్రగడ లాంటి వాళ్లు అరుదు: అంబటి | Ambati Rambabu Meets Mudragada In Kirlampudi | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో ముద్రగడ లాంటి వాళ్లు అరుదు: అంబటి

Jul 17 2024 6:22 PM | Updated on Jul 17 2024 7:00 PM

Ambati Rambabu Meets Mudragada In Kirlampudi

సాక్షి, కాకినాడ: రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం వంటి నాయకులు అరుదుగా ఉంటారని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కాపుల కోసం.. కాపు రిజర్వేసన్‌ల కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన వ్యక్తి ముద్రగడ అని కొనియాడారు. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం కలిశారు.

అనంతరం అంబటి మాట్లాడుతూ.. రాజకీయాల్లో నష్టపోయిన ముద్రగడ.. తన కులాన్ని ఏనాడు ఉపయోగించుకోలేదని అన్నారు. కాపునాడు సమావేశం సమయంలో టీడీపీకి రాజీనామా చేసి ఆ సమావేశానికి ముద్రగడ వచ్చారని తెలిపారు. ఆ సమయంలో వంగవీటి జైలులో ఉన్నారని, కేవలం ఒక సవాల్‌ను స్వీకరించి ముద్రగడ తన పేరును మార్చుకున్నారని పేర్కొన్నారు. పేరు మారినా.. ముద్రగడ.. ముద్రగడేనని, అందుకే ఆయన్ను అభినందించాలని కిర్లంపూడి వచ్చినట్లు చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement