అమిత్‌ షాపై కేసు ఎత్తేశారు.. నాపై కేసు మూయలేదు | Akbaruddin Owaisi Comments on CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

అమిత్‌ షాపై కేసు ఎత్తేశారు.. నాపై కేసు మూయలేదు

Jul 28 2024 3:59 AM | Updated on Jul 28 2024 3:59 AM

Akbaruddin Owaisi Comments on CM Revanth Reddy

రేవంత్‌ సర్కారుపై అక్బరుద్దీన్‌ అసంతృప్తి

తప్పుడు కేసులకు భయపడబోనని స్పష్టీకరణ

నగరంలో శాంతిభద్రతలు గాడి తప్పాయని ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: ‘మీ అన్నయ్య (ప్రధాని మోదీ) సోదరుడి (అమిత్‌ షా)పై పెట్టిన కేసును ఎత్తేసి ఈ పేద సోదరుడి (గరీబ్‌ భాయ్‌)పై తప్పుడు కేసును మాత్రం మూసివేయలేదు’ అంటూ సీఎం రేవంత్‌పై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తనకు అన్నయ్య (బడే భాయ్‌) అని.. గతంలో ప్రధాని పాల్గొన్న ఓ బహిరంగ సభలో రేవంత్‌ అనడాన్ని పరోక్షంగా గుర్తు చేశారు.

ఎన్నికల ప్రచారంలో బాలలను వినియో గించారనే ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై నమోదైన కేసును ఎత్తేసిన హైదరా బాద్‌ పోలీసులు.. తనపై నమోదు చేసిన తప్పు డు కేసును మాత్రం ఎత్తేయడానికి నిరాకరించారని అక్బరుద్దీన్‌ ఆరోపించారు. బడ్జెట్‌ పద్దుపై శనివారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన రెండు గంటలపాటు ప్రసంగించారు. ‘రాత్రి 10 గంటల వరకు ఎన్నికల ప్రచారానికి అనుమతి ఉండగా 9:50 గంటలకే ఓ పోలీసు అధికారి సభా వేదిక పైకెక్కి ప్రచారాన్ని ఆపేయాలని కోరారు.

దీనిపై నేను అభ్యంతరం తెలపడంతో కేసు పెట్టారు. అయితే విచారణలో పోలీసులదే తప్పిదమని తేలిందని.. కేసును ఎత్తేస్తామంటూ నాటి పోలీసు కమిషనర్‌ సందీప్‌ శాండిల్య ఫోన్‌ చేసి క్షమాపణలు చెప్పారు. కానీ ఆ తర్వాత వచ్చిన కొత్త సీపీ.. కేసును ఎత్తేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. నేను ముస్లిం కావడమే దీనికి కారణం’ అని అక్బరుద్దీన్‌ ఆరోపించారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడబోనన్నారు.

పోలీసుల సహకారంతోనే డ్రగ్స్‌ సరఫరా
భాగ్యనగరంలో పోలీసుల సహకారంతోనే గంజాయి, డ్రగ్స్‌ సరఫరా జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. నగరంలో శాంతిభద్రతలు గాడితప్పాయని, హత్యలు, అత్యాచారాలు ఆగ డం లేదన్నారు. కాగా, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వక్ఫ్‌ భూముల కబ్జాలపై సీఐడీ విచారణకు ఆదే శించిందని, పురోగతిపై సమీక్షించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ గెలిచిన అసెంబ్లీ స్థానాల పరిధిలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక ఓట్లు రావడంపై ఆలోచించా లని సీఎంను కోరారు. 

బడ్జెట్‌ కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం
బీసీలకు అప్పుడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్యా యం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్యా యం చేస్తోందని అక్బరుద్దీన్‌ ఒవైసీ ధ్వజమె త్తారు. వారికి న్యాయం జరగాలంటే తమతో కలిసి పోరాడాలన్నారు. శనివారం బడ్జెట్‌పై చర్చ లో ఆయన మాట్లాడుతూ ‘బీసీల సంక్షేమం పేరు తో ఎన్నో హామీలిచ్చి నిధులివ్వకపోవడంతో బీసీ లు బీఆర్‌ఎస్‌ను ఓడించారు. వారిప్పుడు ప్రతి పక్ష సీట్లలో కూర్చున్నారు. గతంలో బీసీల కోసం పోరాడుతున్న ఆర్‌.కృష్ణయ్య నుంచి స్ఫూర్తి పొందే నేను మైనారిటీల కోసం గొంతెత్తడం ప్రారంభించా’  అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement