Kolkata Doctor Case: 50 రోజుల్లో శిక్ష పడేలా చట్టాలు రావాలి: అభిషేక్‌ బెనర్జీ | Abhishek Banerjee Reacts As Buzz Over Differences with Mamata Grows Amid Protest | Sakshi
Sakshi News home page

Kolkata Doctor Case: 50 రోజుల్లో శిక్ష పడేలా చట్టాలు రావాలి: అభిషేక్‌ బెనర్జీ

Aug 22 2024 4:44 PM | Updated on Aug 22 2024 6:22 PM

Abhishek Banerjee Reacts As Buzz Over Differences with Mamata Grows Amid Protest

కోల్‌కతా: కోల్‌కతాలో ఆర్జీకార్‌ వైద్య కళాశాలలో వైద్య విద్యార్ధిని హత్యాచారం ఘటనలో  పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో, ఆమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ విభేదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీబీఐ వెంటనే దర్యాప్తు చేసి బాధితురాలికి న్యాయం చేయాలంటూ సీఎం మమతా చేస్తున్న ర్యాలీలకు అతడు దూరంగా ఉండటం ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆయన స్పందించారు.

ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో జరిగిన హత్యాచార ఘటనపై నిరసనలు వ్యక్తమవుతోన్న తరుణంలో.. దేశంలో ఆ తరహాలో ఎన్నో కేసులు వెలుగు చూశాయని  టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచార కేసుల్లో 50 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, దోషులకు శిక్షపడేలా చట్టాలు రావాలని డిమాండ్‌ చేశారు. 

ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘పది రోజులుగా ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. న్యాయం కావాలంటూ వైద్యులు, ఇతరులు రోడ్లపై నినదిస్తున్నారు. ఈ దిగ్భ్రాంతికర నేరానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపై ఉన్న సమయంలోనే దేశంలో అలాంటివి మరో 900 కేసులు వెలుగులోకి వచ్చాయి. 

రోజూ 90 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. వీటిని నిరోధించడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కేవలం వాగ్దానాలకే పరిమితం కాకుండా 50 రోజుల్లోగా విచారణలు పూర్తయి శిక్షలు ఖరారయ్యేలా కఠిన చట్టాలు రావాలి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి’’ అని పోస్టు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement