పంట ఆరోగ్యం.. నేల సురక్షితం | - | Sakshi
Sakshi News home page

పంట ఆరోగ్యం.. నేల సురక్షితం

Nov 24 2026 11:56 PM | Updated on Nov 24 2026 11:56 PM

ఖేతీ బచావో... రైతులకు అండగా ఊరూరా అవగాహన సదస్సులు పురుగుమందుల విచ్చలవిడి వాడకానికి అడ్డుకట్ట

ఓదెల: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఖేతీ బచావో పథకం రైతులకు అండగా నిలుస్తోంది. 2025–26లో పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిషేధిత పురుగుమందుల వాడకాన్ని అరికట్టాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ జిల్లాలో ఊరూరా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రైతుల సంక్షేమం, పంటల నాణ్యత, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఈ ప్రచారం సాగుతోంది. ఖేతీ బచావో అభియాన్‌ వ్యవసాయ రంగంలో కీలకమైన అవగాహన కార్యక్రమంగా నిలుస్తోంది. నిషేధిత పురుగుమందుల వల్ల కలిగే అనర్థాలు, వాటి వినియోగంతో మానవ ఆరోగ్యం, పర్యావరణానికి కలిగే నష్టంపై అధికారులు రైతులకు వివరిస్తున్నారు. అనుమతి పొందిన పురుగుమందులను మాత్రమే వాడాలని సూచిస్తున్నారు.

రైతులకు ముఖ్య ప్రయోజనాలు: ప్రమాదకరమైన నిషేధిత పురుగుమందుల వాడకాన్ని నివారించడం ద్వారా రైతులకు, వ్యవసాయ కూలీలకు ఆరోగ్యం చేకూరుతుంది. నేల, నీరు, గాలి కాలుష్యం తగ్గడంతోపాటు మిత్ర పురుగులు, తేనెటీగలు, జీవ వైవిధ్యాన్ని కాపాడవచ్చు. నకిలీ, నిషేధిత ఉత్పత్తుల నివారణకు రైతులు పురుగుమందుల లేబుల్‌, రిజిస్ట్రేషన్‌ వివరాలు, గడువు తేదీలను పరిశీలించి కొనుగోలు చేయాలి. పంటలను కోసిన తర్వాత వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలియదున్నాలి. భూసార పరీక్షలు చేయించుకోవాలి.

రైతులకు ఫలితాలు: నిషేధిత పురుగుమందుల వాడకం తగ్గడం, పంట వ్యర్థాలను కాల్చకుండా కలియదున్నడం ద్వారా భూసారం పెరుగుతుంది. రైతుల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుంది. సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement