స్వచ్ఛమైన తాగునీటి కోసం ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛమైన తాగునీటి కోసం ఉద్యమం

Nov 24 2026 11:56 PM | Updated on Nov 24 2026 11:56 PM

గోదావరిఖని: కార్మిక వాడలకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరా కోసం ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్నామని టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి సరఫరా చేస్తున్న నీరు అపరిశుభ్రంగా ఉందని ఆరోపించారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంత మురుగునీరు, పారిశ్రామిక వ్యర్ధాలు నేరుగా గోదావరినదిలో కలుస్తున్నాయని, ఇన్‌టెక్‌వెల్‌తో అనుసంధానించిన పైపులైన్లు పాడవడంతో ఫిల్టర్‌ కాకుండానే నీరు సరఫరా అవుతోందన్నారు. మూతబడిన మేడిపల్లి ఓపెన్‌కాస్ట్‌గని నుంచి తాగునీరు సరఫరా చేయాలని కోరారు. నాయకులు జాహిద్‌పాషా, రవీందర్‌రెడ్డి, ఐ.సత్యనారాయణ, వాసర్ల జోసెఫ్‌, జనగామ మల్లేశ్‌, రెహమాన్‌, రాజ్‌కుమార్‌, కళాధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement