గోదావరిఖని: సింగరేణి కార్మికుల సొంతింటి కల సాకారం చేసేందుకు ఐదేళ్లుగా నిర్విరామ పోరాటం చేస్తున్నామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి అన్నారు. మంగళవారం గోదావరిఖనికి వచ్చిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్‌ను కలిసి సొంతింటి పథకం అమలు చేయాలని కోరారు. సొంతింటి పథకం ఆవశ్యకత, విధివిధానాలు తెలియజేస్తూ వినతిపత్రం అందించారు. అన్నిరకాలుగా లాభమైన ఈ పథకం అమలు కోసం కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరెపల్లి రాజమౌళి, వంగల శివరాంరెడ్డి, తోట నరహరిరావు, జనార్దన్, సాయిప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.


