వద్దన్నా.. వరికే జై | - | Sakshi
Sakshi News home page

వద్దన్నా.. వరికే జై

Sep 1 2026 12:37 AM | Updated on Sep 1 2026 12:37 AM

ఎల్‌నినో ప్రభావం ఉన్నా భారీగా సాగు లక్ష్యానికి మించి 2.15 లక్షల ఎకరాల్లో నాట్లు వేసిన రైతులు సెప్టెంబర్‌, అక్టోబర్‌లో కురిసే వర్షాలపైనే అన్నదాతల ఆశలు పూర్తిస్థాయిలో నిండని చెరువులు, కుంటలు, జలవనరులు భూగర్భ జలాలపై పెరుగుతున్న ఒత్తిడి

ప్రాజెక్టుల్లో తగ్గిన ఇన్‌ఫ్లో

సాక్షి, పెద్దపల్లి:

ల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని, వరి సాగు చేస్తే చివరిదశలో నీటిఎద్దడి తలెత్తుతుందని వ్యవసాయాధికారు లు ముందుగానే హె చ్చరించారు. ప్రత్యామ్నాయంగా తక్కు వ నీరు అవసరమ య్యే ఆరుతడి పంటల వైపు మళ్లించేందుకు అవగాహన క ల్పించారు. వారి సూ చనలను రైతులు పట్టించుకోలేదు. ఆగస్టులో కురిసిన వర్షా లు కలిసిరావడంతో వరివైపే మొగ్గు చూపారు. ఫలితంగా అంచనాలను తలకిందులు చేస్తూ వరిసాగు 2.15 లక్షల ఎకరాలకు చేరింది. ప్రస్తుతం నాట్లు పూర్తయ్యాయి. అవసరమై న నీటితడుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

సగానికి తగ్గుతుందని అంచనా వేసి ..

ఎల్‌నినోతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని భావించిన వ్యవసాయశాఖ.. గతంతో పోలిస్తే ఈ వానాకా లంలో వరి సాగు తగ్గుతుందని అంచనా వేసింది. ముఖ్యంగా వరికి అధికంగా నీరు అవసరమయ్యే ప రిస్థితుల్లో భవిష్యత్‌లో నీటిలభ్యత సమస్యగా మారు తుందని భావించి రైతులను ఆరుతడి పంటల వైపు ప్రోత్సహించింది. ఆగస్టులో కురిసిన వర్షాలు పరిస్థితిని మార్చేశాయి. మూడురోజుల పాటు కురిసిన వానలతో పొలాల్లో తేమ లభించడంతో వరి నాట్లు ముమ్మరం చేశారు. ఫలితంగా సాగు తగ్గకపోగా.. వ్యవసాయశాఖ అంచనాలకు భిన్నంగా లక్ష్యాన్ని మించి నమోదైంది. వ్యవసాయశాఖ నిర్దేశించిన ల క్ష్యం 2,11,611 ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 2,15,000 ఎకరాల్లో వరి సాగులోకి వచ్చింది.

నీటి కొరతపై ఆందోళన

ప్రస్తుతం వర్షాలు, అందుబాటులో ఉన్న నీటితో వ రినాట్లు సజావుగా సాగుతున్నా.. చివరిదశలో నీటిఅవసరం అధికంగా ఉంటుంది. ఎల్‌నినోతో సెప్టెంబర్‌, అక్టోబర్‌లో వర్షాలు కురవకుంటే నీటికొరత ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. తద్వా రా భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతుందన్నారు.

సాధారణానికి చేరువగా వర్షపాతం

జిల్లాలో వర్షపాతం సాధారణానికి చేరువలోనే ఉంది. గత జూన్‌ 1 నుంచి సోమవారం వరకు 685.8 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. 659.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. కానీ, చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నీటితో నిండలేదు. సాగునీటి వనరుల్లో తగినంత నీటినిల్వలు లేకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

బోర్లపైనే ఆశలు

అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో రైతులు నాట్లు వేశారు. కొన్నిపొలాల్లో కలుపు తీస్తున్నారు. వర్షాలు కురవకపోయినా బోరుబావుల ద్వారా నీరు అందిస్తున్నారు. పంట పొట్టదశకు, ఆ తర్వాత గింజ దశకు చేరుకునే సమయానికి నీటిఅవసరం మరింత పెరుగుతుంది. ఆ సమయంలో భూగర్భ జలాలు తగ్గిపోతే బోరుబావుల ద్వారా కూడా నీరందించడం కష్టంగా మారే ప్రమాదం ఉంది.

జిల్లాకు సాగునీరు అందించే ప్రాజెక్టుల్లో ప్రస్తుతం నీటినిల్వలు పరిమితంగానే ఉన్నాయి. వరద ప్రవాహం తగ్గడంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇన్‌ఫ్లో తగ్గడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మధ్యమానేరు, దిగువమానేరు, వరదకాలువలోకి ఎత్తిపోతలను అధికారులు నిలిపివేశారు. దీంతో వరికి భూగర్భ జలాలే ప్రధాన ఆధారంగా మారాయి. ఇక సెప్టెంబర్‌, అక్టోబర్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిస్తే వరి సాగు గట్టెక్కినట్టే.. లేకపోతే పంట చివరి దశలో నీటి ఎద్దడి తలెత్తి రైతులను వెంటాడే అవకాశం ఉంది.

జాగ్రత్తలు పాటించాలి

జిల్లాలో వరి సాగు లక్ష్యానికి మించి నమోదైన నేపథ్యంలో రైతులు రానున్న రోజుల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని యాజమాన్య చర్యలు చేపట్టాలి. నీటిని వృథాగా నిల్వ ఉంచకుండా అవసరమైన మేరకే వినియోగించాలి. బోరుబావులపై ఆధారపడకుండా అందు బాటులో ఉన్ననీటిని పొదుపుగా వినియోగించుకోవాలి. పంట కీలక దశకు చేరుకునే సమయంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోవాలి.

– శ్రీనివాస్‌, జిల్లా వ్యవసాయాధికారి

జిల్లాలో సాగు విస్తీర్ణం(ఎకరాల్లో)

వరి 2,15,000

పత్తి 51,432

మొక్కజొన్న 950

కంది 254

పెసర 45

మినుములు 15

అలసంద 45

కూరగాయలు 650

మిర్చి 165

పసుపు 450

ఆయిల్‌పామ్‌ 4,720

మామిడి 5,200

అరటి 52

ఇతర పంటలు 98

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement