అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Sep 1 2026 12:37 AM | Updated on Sep 1 2026 12:37 AM

● ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్‌: ప్రజాప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌లోని పూసాల, పెద్దపల్లిలోని రంగంపల్లి, సుభాష్‌నగర్‌ ప్రాంతాల్లో సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు ఆయన గృహ ప్రవేశాలు చేశారు. విప్‌ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మరోవిడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పెద్దపల్లిలో చేపట్టిన సుమారు 370 ఇందిరమ్మ ఇళ్లు దసరా, దీపావళి పండుగల వరకు ప్రారంభానికి సిద్ధమవుతాయని తెలిపారు. సుల్తానాబాద్‌, పెద్దపల్లి మున్సిపల్‌ చైర్మన్లు బిరుదు రాధాకృష్ణ, నూగిల్ల మల్లయ్య వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్లు ప్రకాశ్‌రావు, మల్లారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు నరేశ్‌, శ్రీనివాస్‌, జానీ, మున్సిపల్‌ కమిషనర్లు రమేశ్‌, వెంకటేశ్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

కంపోస్ట్‌ షెడ్‌ పనులకు శంకుస్థాపన

పెద్దపల్లి పట్టణంలో సేకరించిన భవన నిర్మాణ వ్యర్థాలను వేరు చేసేందుకు ఎకరంన్నర స్థల విస్తీర్ణంలో చేపట్టిన కంపోస్టుషెడ్‌ పనులకు ప్రభుత్వ విప్‌ విజయరమణారావు శంకుస్థాపన చేశారు. రాఘవాపూర్‌ శివారులో ఏర్పాటు చేసే ఈ యూని ట్‌ నిర్మాణాన్ని ఆరునెలల్లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. అధికారులు, నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement