తహసీల్దార్‌పై చర్య తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌పై చర్య తీసుకోవాలి

Sep 1 2026 12:37 AM | Updated on Sep 1 2026 12:37 AM

పాలకుర్తి మండలం భీమ్లా నాయక్‌ తండాకు చెందిన ఇస్లావత్‌ సుజాత బతికుండగానే రెవెన్యూ రికార్డులో మరణించినట్లు చూపించారు. నకిలీ రికార్డు సృష్టించి మరోవ్యక్తికి భూమి రిజిస్ట్రేషన్‌ చేసిన తహసీల్దార్‌పై కేసు నమోదు చేయాలి.

– ఇస్లావత్‌ సుజాత, మెరుగు చందర్‌

నిధుల స్వాహాను అరికట్టాలి

మడక గ్రామ పంచాయతీలో పైప్‌లైన్‌ వేయకుండా నిధులు స్వాహా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్‌ అధికారులు విచారణ జరపాలి. జరిగిన పనులకు బిల్లులు చెల్లించాలి. చేయని పనులకు బిల్లులు మంజూరు చేయొద్దు.

– ముత్తయ్య, మాజీ ఎంపీటీసీ, మడక

స్కావెంజర్లకు జీతాలు ఇవ్వండి

నాలుగు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పార్ట్‌టైం ఉద్యోగం అని చెప్పి ఫుల్‌టైం పనులు చేయించుకుంటున్నారు. ఇది సరికాదు. అధికారులు చొరవ తీసుకొని జీతాలు ఇప్పించాలి.

– సుమలత, స్కావెంజర్లు, పెద్దపల్లి

అద్దెకు ఇల్లు ఇవ్వడం లేదు

పుట్టినప్పటి నుంచి పెద్దపల్లిలోనే ఉంటున్నాం. అద్దెకు ఇల్లు దొరకడం లేదు. డబుల్‌బెడ్రూమ్‌ ఇల్లు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. ఇందిరమ్మ రాజ్యంలో మాకు సొంతింటి కల నెరవేర్చాలి. అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి. – జొంగని శ్రావ్య, పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement