పాలకుర్తి: జీడీనగర్ సమీప ఫోర్‌లైన్ రోడ్డుపై టోల్‌ప్లాజా నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎగువ, దిగువకు వెళ్లే వాహనాలకు వేర్వేరుగా దారులు ఉండగా ఇరువైపులా ద్వి, త్రిచక్ర వా హనాలు వెళ్లేందుకు ప్రత్యేకంగా సర్వీసు రోడ్లు ఏర్పాటు చేశారు. తరచూ ప్లాజా వద్ద సాంకేతి క సమస్యలు తలెత్తడంతో నిర్వాహకులు ఉచిత సర్వీసు రోడ్డును సైతం టోల్‌రోడ్డుగా మారు స్తూ టోల్ చెల్లించే వాహనాలకు అనుమతిస్తు న్నారు. తద్వారా ద్వి, త్రిచక్ర వాహనదారులకు దారిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త రచూ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా యాజమాన్యం సరిదిద్దే ప్రయత్నాలు చేయక పోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయమై అఽధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
‘హామీల అమలులో విఫలం’
గోదావరిఖని: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభు త్వం విఫలమైందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షు డు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు కౌశిక్‌హరి, మిర్యాల రాజిరెడ్డితో కలిసి మాట్లాడారు. వెయ్యిరోజుల పాలనలో ప్రజల కు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వి ఫలంపై బీఆర్‌ఎస్ ఈనెల 2న సమరశంఖం పూరిస్తుందన్నారు. విద్యార్థులు, యువత, రై తులు, కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. బీఆర్‌ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మే కల సమ్మయ్య, కార్పొరేటర్ కర్క పద్మజ, నా యకులు కల్వచర్ల కృష్ణవేణి, మెతుకు దేవరాజ్, గుర్రం పద్మ, రవి, మొగిలి పాల్గొన్నారు.
ఖాళీగా రిజర్వేషన్ కౌంటర్
రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్‌లో సోమవా రం రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ రెండు గంటల పాటు ఒక్క ప్రయాణికుడు కూడా లేక బోసి పోయి కనిపించింది. ఉదయం పది గంటలకు ఏసీ, పదకొండు గంటలకు స్లీపర్‌క్లాస్ టికెట్ రిజర్వేషన్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆరంభం నుంచి ఒక్క ప్రయాణికుడు కూడా టికెట్ బుక్ చేసుకోవడానికి రాలేదు. అన్‌సీజన్ కావడం, అత్యధికంగా ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవడానికి ఆసక్తి చూపించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు.
కుల వివక్షను అరికట్టాలి
పెద్దపల్లి: జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై కుల వివక్ష కొనసాగుతున్నా అధికారులు, పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆల్ సంఘా ల ఐక్య వేదిక నాయకులు ఆరోపించారు. సో మవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. జూలై 18న నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ కమి షన్ సమీక్షలో బాధితులు సమర్పించిన పలు దరఖాస్తులు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. అకారణంగా సస్పెన్షన్‌కు గు రైన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆలిండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రె సిడెంట్ మధు, జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, పెద్దపల్లి మాజీ ప్రజాప్రతినిధి కుక్క అశోక్ తదితరులు పాల్గొన్నారు.
లైంగికదాడి కేసులో అరెస్ట్
గోదావరిఖని: మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో స్థానిక శివాజీనగర్‌కు చెందిన నిందితుడు నదీంబాబా(30)ని అరెస్ట్ చేసినట్లు వ న్‌టౌన్ పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.


