జ్యోతినగర్: ఎన్టీపీసీ ప్రాంతంలోని వివిధ కాలనీ వాసులకు ప్రభుత్వ వైద్యసేవలు అందుబాటులేవు. ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ), అ ర్బన్ హెల్త్ సెంటర్ (యూపీహెచ్‌సీ) రెండూ రామగుండం ప్రాంతంలోనే ఉండడం ఇందుకు కారణమవుతోంది. సుమారు 20 కి.మీ. దూరంలోని రామగుండం వెళ్లి వైద్యసేవలు పొంది రావడం వ్యయప్రయాసలతో కూడుకుంటోంది. అర్బన్ హెల్త్ సెంట ర్ పట్టణ ప్రాంత ప్రజలకు చేరువలోకి తీసుకురావడంలో ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా.. ప్రైమ రీ హెల్త్ సెంటర్ ఉన్న ప్రాంతంలోనే కొనసాగించడం ద్వారా పేదలు ఎవరికీ ప్రయోజనం లేకుండాపోతోంది. అంతదూరం వెళ్లడం, మళ్లీ తమ ప్రాంతాలకు రావడం కోసం వృద్ధులు, గర్భిణులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలు ఆటో, ఇతర వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది.
ఆరోగ్య కేంద్రాల పరిధిలో సేవలు
పీహెచ్‌సీ పరిధిలో జంగాలపల్లె, శాలపల్లె, పోరట్‌పల్లి, కృష్ణానగర్, హెడ్ క్వార్టర్స్ ఏరియా, మల్కాపూర్ ఉన్నాయి. యూపీహెచ్‌సీ పరిధిలో రామగుండం, మల్యాలపల్లె, విలేజ్ రామగుండం, లింగాపూ ర్, మసీదు ఏరియా, న్యూపీకే రామయ్యకాలనీ, అ న్నపూర్ణకాలనీ, సుభాష్‌నగర్, కాకతీయనగర్, ఇందిరమ్మకాలనీలు ఉన్నాయి.
హెల్త్ సెంటర్ తరలిస్తే
రామగుండంలోని హెల్త్ సెంటర్‌ను ఎన్టీపీసీ ప్రాంతానికి తరలిస్తే.. ఇక్కడి జంగాలపల్లె, శాలపల్లె, పోరట్‌పల్లి, అన్నపూర్ణకాలనీ, న్యూపీకే రామయ్యకాలనీ, కృష్ణానగర్, సుభాష్‌నగర్, కాకతీయనగర్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ వాసులకు అందుబాటులోకి వస్తాయని స్థానికులు అంటున్నారు.
ఎన్టీపీసీకి మార్చాలి
వైద్యం కోసం ప్రతీనెల రామగుండం వెళ్లడం ఇబ్బందిగా ఉంది. ఆశ వర్కర్లు రామగుండమే రావాలంటున్నరు. ఎన్టీపీసీకి మార్చాలె. కష్టాలు తీర్చాలే. అధికారులు చొరవ చూపాలె.
– అఖిల, న్యూపీకే రామయ్యకాలనీ
ఇబ్బందిగా ఉంది
చిన్నఆరోగ్య సమస్యకై నా రామగుండం వెళ్లాల్సి వస్తంది. రవాణా ఖర్చు, సమయం వృథా అవుతంది. ఎన్టీపీసీ ప్రాంతానికి అర్బన్ హెల్త్ సెంటర్ తరలిస్తే వేలాది మందికి ఉపయోగపడుతుంది.
– మౌనిక, ఇందిరమ్మకాలనీ
ఎన్టీపీసీ ప్రజలకు వైద్యసేవలు దూరం


