ముత్తారం: ఇండస్ట్రియల్ పార్క్‌కు అవసరమైన భూ సేకరణ కోసం శనివారం ధర్యపూర్ వెళ్లిన తహసీల్దార్, అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. తమ జీవనాధారమైన భూములు లాక్కుంటే తా ము బతికేదెట్లా? అని ప్రశ్నించారు. కలెక్టర్ ఆదేశా ల మేరకు తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి తాజాగా అ వగాహన సదస్సు నిర్వహించారు. పరిహారం ఊసెత్తకుండా ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు. తహసీల్దార్ మాట్లాడుతూ 80 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పా ర్క్ నిర్మాణానికి సర్వేచేయాలని ఆదేశాలు వచ్చాయన్నారు. రైతు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని వివరించారు. నిర్వాసితుల డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపా రు. ముత్తారం, రామగిరి ఎస్సైలు రవికుమార్, శ్రీనివాస్ బందోబస్తు నిర్వహించారు. మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజాబాబు, కేశనపల్లి మాజీ సర్పంచ్ నూనె కుమార్, రైతులు పాల్గొన్నారు.
ఏజెన్సీ రద్దు చేయాలని డిమాండ్
కోల్‌సిటీ: చెత్త సేకరణకు అమలు చేస్తున్న పైలెట్ ప్రాజెక్ట్ ఏజెన్సీని రద్దు చేయాలనే డిమాండ్‌తో ము న్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో రామగుండం బల్దియా ఎదుట శనివారం ర్యాగ్ పిక్కర్లు ధర్నా చేశారు. యూనియన్ అధ్యక్షు డు మద్దెల దినేశ్, ప్రధాన కార్యదర్శి గౌస్ మా ట్లాడుతూ, 26 ఏళ్లుగా ర్యాగ్ పిక్కర్లు ఇంటింటా చె త్త సేకరిస్తూ ఉపాధి పొందుతున్నారన్నారు. నెలకు రూ.250 మ్యాచింగ్ గ్రాంట్‌తో ప్రారంభమైన వీరిజీవితం ప్రస్తుతం రూ.4వేలకు చేరిందని, ఒక్కో ఇంటినుంచి రూ.50 చొప్పున వసూలయ్యే వినియోగ రుసుంతో కొనసాగుతోందన్నారు. ఇలాంటివారికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అవకాశం కల్పిస్తారని ఆశిస్తే, పైలెట్ ప్రాజెక్టు ఏజెన్సీలను తీసుకురావడం అన్యాయమన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేసిన నాయకులు.. అనంతరం కలెక్టర్‌కూ విన్నవించినట్లు వివరించారు.


