● ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
గోదావరిఖని: మెడికల్ బోర్డును ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ విమర్శించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం, జీడీకే–11గనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో వారు మా ట్లాడారు. బొగ్గు మాయమైందని బీజేపీ, బీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారం అసత్యమని, దుర్మార్గమన్నారు. సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధనను పట్టించుకోకుండా రాజకీయ పార్టీలు బాయిబాట పడుతూ దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో 75 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని అప్పుడు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారని, ఇప్పుడు అదే నాయకుడు బీఆర్‌ఎస్‌లో ఉన్నారని గుర్తు చేశారు. కార్మికుల డిమాండ్లపై నిర్లక్ష్యం చేస్తే అన్ని కార్మిక సంఘాలతో సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. 12వ వేజ్‌బోర్డు సాధన, కొత్త గనుల ఏర్పాటు కోసం ఏఐటీయూసీయు పోరాటం చేస్తుందని తెలిపారు. నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, వైవీ రావు, కె.వీరబద్రం, కె.స్వామి, రాజరత్నం, రాంచందర్, గౌతమ్‌గోవర్ధన్, రంగు శ్రీను, గంధం సాంబశివరావు, టి.రమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మంథని ఆర్డీవో కార్యాలయానికి నిధులు
మంథని: రాష్ట్రంలోని 10 ఆర్డీవో, 107 తహసీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈజాబితాలో మంథని రెవెన్యూ డివిజన్, కమాన్‌పూర్, పాలకుర్తి తహసీల్దార్ కార్యాలయాలకు చోటుదక్కింది. ఒక్కో భవనానికి రూ.2.25 కోట్లు మంజూరు చేసినట్లు ఉత్తర్వ్యూల్లో ప్రభుత్వం పేర్కొంది.


