3లోగా ఎన్యూమరేషన్‌ పత్రాలు పంపిణీ | - | Sakshi
Sakshi News home page

3లోగా ఎన్యూమరేషన్‌ పత్రాలు పంపిణీ

Jun 28 2026 7:36 AM | Updated on Jun 28 2026 7:36 AM

పెద్దపల్లి: వచ్చే జూలై 3వ తేదీలోగా జిల్లావ్యాప్తంగా ప్రతీఓటరుకు ఎన్యూమ్యూరేషన్‌ పత్రం అందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్‌లో శనివారం చేపట్టిన ఎస్‌ఐఆర్‌ ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను కలెక్టర్‌ ఆక స్మికంగా తనిఖీ చేశారు. బీఎల్‌వోలకు అందరూ సహకారం అందించాలన్నారు. తహసీల్దార్‌ రాజ య్య, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌ పాల్గొన్నారు.

నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్‌ శ్రీహర్ష సూచించారు. స్థానిక వెంకట పద్మ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన జిల్లాస్థాయి సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడారు. విద్యార్థులు స్వతంత్రంగా చదవడం, మాట్లాడడం, నేర్చుకున్న అంశాలను సృజనాత్మకంగా వ్యక్తపరచడం లాంటివి చేయడం కోసం తీర్చిదిద్దాలని కోరారు. జిల్లాలోని 14 మండలాల నుంచి సుమారు 1,000 మంది ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు హాజరుకాగా, జెడ్పీ సీఈవో నరేందర్‌, అధికారులు పీఎం షేక్‌, మల్లేశ్‌, కవిత, అలోకిట్‌, సమీర్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement