పెద్దపల్లి: పల్స్‌పోలియోను విజయవంతం చే యాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఇందుకోసం ఈనెల 28న బూత్ డే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 29, 30వ తేదీల్లో ఇంటింటా సర్వే చేస్తారని, జిల్లావ్యాప్తంగా 62,902 మంది చిన్నారులకు పోలియోచుక్కలు వేయడం లక్ష్యంగా నిర్ణయించామని వివరించారు. చుక్కలమందు వేసే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
భద్రతతో విధులు
జ్యోతినగర్: విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వామ్యులవుతున్న కాంట్రాక్టు కార్మికులు విధి నిర్వహణలో భద్రత చర్యలు పాటించాలని ఎన్టీపీసీ ఎ గ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత సూచించారు. తెలంగాణ ప్రాజెక్టు సర్వీసు బి ల్డింగ్‌లో జూలై 2వ తేదీ వరకు నిర్వహించే జా తీయ విద్యుత్ భద్రత వారోత్సవాలను శుక్ర వారం ప్రారంభించి మాట్లాడారు. జీఎంలు ముకుల్ రాయ్, అవిజిత్ దత్తా, బినోయ్ జోష్‌తోపాటు అధికారులు, ఉద్యోగులు ఉన్నారు.
ఉద్యమకారుల సమ్మేళనం
పెద్దపల్లి/కమాన్‌పూర్: హైదరాబాద్‌లో ఈనెల 28న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ స మ్మేళనం నిర్వహిస్తామని ఆ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి కావటి సతీశ్ యాదవ్ తెలిపారు. సమ్మేళనం ప్రచార పోస్టర్‌ను జిల్లా కేంద్రంతోపాటు కమాన్‌పూర్‌లో శుక్రవారం ఆ విష్కరించి మాట్లాడారు. ఎలిగేడు, ర్యాకల్‌దేవ్‌పల్లి స ర్పంచులు కప్పల ప్రవీణ్, మధ్యల సంపత్, నాయకులు జావేద్‌ఖాన్, ఖమ్మం సురేశ్, బోయిని సుమన్, శ్రవణ్ పాల్గొన్నారు.
వ్యసనపరులు నేరస్తులు కాదు
గోదావరిఖని: గంజాయి వ్యవసనపరులు నేరస్తులు కాదని, వారిని బాధితులుగానే చూడా లని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచించారు. మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక రాజీవ్ రహదారిపై శుక్రవారం మానవహారం నిర్వహించారు. డీసీపీతోపాటు ఏసీపీ రమేశ్ పాల్గొని మాట్లాడారు. వ్యసనపరులను గుర్తించిన పోలీసులకు లేదా డయల్ 100, 1908 నంబర్లకు సమాచారం అందిస్తే ఆ స్పత్రులు, డీ అడిక్షన్ కేంద్రాలకు తరలించి వై ద్యచికిత్సలు, కౌన్సెలింగ్, పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వన్‌టౌన్ సీఐలు ఇంద్రసేనారెడ్డి, అఫ్జలుద్దీన్, ఎస్సైలు మనోహర్, అనూష పాల్గొన్నారు.
కలెక్టర్ ఫొటోకు క్షీరాభిషేకం
ముత్తారం: పోతారంలోని సర్వే నంబరు 59, మైదంబండలోని 113 సర్వే నంబరులోని అ క్రమ పట్టాలను రద్దు చేసిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష చిత్రపటానికి బాధిత రైతులు శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. మంథని డివిజన్ దళిత నాయకుడు ఊట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, స్వాధీనం చేసుకున్న భూమిని 48 మంది పేదరైతులకు పంపిణీ చేయాలన్నారు.
మడేలేశ్వరస్వామికి బోనాలు
ఎలిగేడు: రజక సంఘం ఆధ్వర్యంలో శు క్రవారం మండల కేంద్రంలో మడేలేశ్వర స్వామి బోనాలు వైభవంగా నిర్వహించా రు. మహిళలు స్వామివారికి బోనంతో నైవేద్యం సమర్పించి మొక్కు లు చెల్లించుకున్నారు. ఈకార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు ముంజంపల్లి సాయిలు, ముంజంపల్లి రాజేశం, వార్డుసభ్యులు కవిత, రాకేశ్, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
నిరుద్యోగ మహిళలకు వరం
పెద్దపల్లి: జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్ పోస్టల భర్తీకి అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. తద్వా రా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన నిరుద్యోగ మహిళలకు ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. జూలై 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 62 టీచర్, 252 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.


